Budget 2023 : నిర్మల మాటలు... వేతన జీవుల్లో కొత్త ఆశలు...

ABN , First Publish Date - 2023-02-01T10:30:48+05:30 IST

2023-24 కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు కాస్త ఊరట లభించే అవకాశాలు ఉన్నాయనే ఆశలు మొలకెత్తుతున్నాయి.

Budget 2023 : నిర్మల మాటలు... వేతన జీవుల్లో కొత్త ఆశలు...
Nirmala Sitharaman

న్యూఢిల్లీ : 2023-24 కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు కాస్త ఊరట లభించే అవకాశాలు ఉన్నాయనే ఆశలు మొలకెత్తుతున్నాయి. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు వస్తాయని చాలా మంది ఆశిస్తున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి వర్గానికి ఉపశమనం కలిగించే విధంగా ఆదాయపు పన్ను విధింపులో వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ భావనకు కారణం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాటలే.

ఇటీవల ఆమె మాట్లాడుతూ, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి తనకు తెలుసునని అన్నారు. దీంతో పన్ను చెల్లింపుదారుల జేబుల్లో కొంచెం డబ్బు మిగిలే విధంగా ఏర్పాట్లు చేస్తారని ఆశిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం మాత్రం ప్రధాన మంత్రి కార్యాలయానిదేనని కొందరు చెప్తున్నారు. గత బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పు లేదనే విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-01T10:30:53+05:30 IST