Rahul Gandhi Disqualified: ఆమెలాగే అనర్హత వేటుకు గురయ్యారు మనవడు రాహుల్‌గాంధీ

ABN , First Publish Date - 2023-03-25T04:46:37+05:30 IST

నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. నానమ్మ ఇందిర లాగే పార్టీలో తిరుగులేని నేతగా ఎదగాలని, ప్రధాని కావాలని ప్రయత్నిస్తున్నారు.

Rahul Gandhi Disqualified: ఆమెలాగే అనర్హత వేటుకు గురయ్యారు మనవడు రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. నానమ్మ ఇందిర లాగే పార్టీలో తిరుగులేని నేతగా ఎదగాలని, ప్రధాని కావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే నానమ్మలా ప్రధాని అవుతారో, లేదో తెలియదుగానీ.. ఆమెలాగే అనర్హత వేటుకు మాత్రం గురయ్యారు మనవడు రాహుల్‌గాంధీ. ఇందిరాగాంధీ కూడా 1975లో ఇలాగే అనర్హతకు గురయ్యారు. పైగా ఆమె ప్రధానిగా ఉండగానే అనర్హతను ఎదుర్కొన్నారు.. అది చివరికి దేశంలో ఎమర్జెన్సీకి దారితీసింది. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీలో గెలుపొంది ప్రధాని పదవిని చేపట్టిన ఇందిరాగాంధీ.. తాను పోటీ చేసిన రాయ్‌బరేలీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆమె చేతిలో ఓడిపోయిన రాజ్‌నారాయణ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

దీనిని విచారించిన అలహాబాద్‌ హైకోర్టు ఇందిర ఎన్నిక చెల్లదంటూ రాజ్‌నారాయణ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై ఆరేళ్లపాటు అనర్హత వేటు పడింది. ఇందిర పైకోర్టుకు వెళ్లి అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. అయితే అప్పుడు ఇందిర అధికారంలో ఉండగా.. ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రతిపక్షంలో ఉన్నారు.

Updated Date - 2023-03-25T04:50:05+05:30 IST