Jacqueline Fernandez: జాక్వెలిన్ వ్యవహారంలో పెద్ద ట్విస్ట్.. ఆ పని చేయలేదంటూ సీబీఐ దర్యాప్తుకి సుకేష్ విజ్ఞప్తి
ABN , Publish Date - Dec 27 , 2023 | 03:52 PM
మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ తాజాగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వ్యవహారంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. తాను జైలు నుంచి జాక్వెలిన్‌కి...
Sukesh - Jacqueline Case: మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ తాజాగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వ్యవహారంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. తాను జైలు నుంచి జాక్వెలిన్‌కి ఎలాంటి టెక్ట్స్ మెసేజ్‌లుగానీ, వాయిస్ నోట్స్ గానీ పంపలేదని కుండబద్దలు కొట్టాడు. ఆ సందేశాలన్నీ నకిలీవి అని పేర్కొన్నాడు. అంతేకాదు.. తన పేరుతో చేసిన ఆ వాట్సాప్ చాట్‌లపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించాడు. తన పేరుతో అలాంటి సందేశాలను సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
కాగా.. మంగళవారం (26-12-23) కాన్‌మ్యాన్ సుకేష్ జైల్లో నుండే ఒక ఫేక్ నంబర్‌తో జాక్వెలిన్‌కు వాట్సాప్ ద్వారా టెక్ట్స్ మెసేజ్‌లు పంపినట్లు కొన్ని స్క్రీన్‌షాట్‌లు వెలుగులోకి వచ్చాయి. ఆ సందేశాల్లోని ఒక దాంట్లో.. కోర్టు విచారణ సమయంలో నలుపు దుస్తుల్లో రావాల్సిందిగా జాక్వెలిన్‌ని అతడు రిక్వెస్ట్ చేసినట్లు పేర్కొని ఉంది. అయితే.. ఈ సందేశాలు తాను పంపలేదని అతడు బుధవారం నాడు క్లారిటీ ఇచ్చాడు. దీని వెనుక ఎవరో ఉన్నారని, తప్పకుండా ఈ వాట్సాప్ చాట్‌పై సీబీఐ దర్యాప్తు జరపాల్సిందేనని అతడు కోరుతున్నాడు. తమ మధ్య (జాక్వెలన్‌తో) దూరం పెంచేందుకు ఈ కుట్ర పన్ని ఉంటారన్న అనుమానాల్ని వ్యక్తం చేశాడు. ఆర్థిక నేరాల విభాగం (EOW) ‘పక్షపాతం’గా వ్యవహరిస్తోందని కూడా ఆరోపణలు చేశాడు.
ఇదిలావుండగా.. సుకేష్ నుండి వస్తున్న బెదిరింపుల నుంచి రక్షణ కోరుతూ జాక్వెలిన్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. అంతేకాదు.. సుకేష్ కేసులో తాను అమాయక బాధితురాలినని, తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు మెట్లు కూడా ఎక్కింది. మరోవైపు.. జాక్వెలిన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కొనుగోలు చేసేందుకు తాను ఒక సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ సంస్థకు కోట్లాది రూపాయలు బదిలీ చేశానని సుకేష్ చెప్పాడు. కత్రినా కైఫ్ ఫాలోవర్లతో పోటీ పడాలన్న ఆమె కోరికని తీర్చేందుకు కోట్లు ఖర్చుపెట్టానని తెలిపాడు. జాక్వెలిన్ తండ్రికి చెందిన సంస్థల్లోనూ కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. మరి, ఈ వాదనలపై జాక్వెలిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.