PM Modi: జో బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ, రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు
ABN , First Publish Date - 2023-06-22T11:17:53+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. భారత్, అమెరికా రక్షణ సహకారంపై చర్చించారు.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో(US President Joe Biden) ప్రధాని మోదీ(PM Narendra Modi) సమావేశం అయ్యారు. భారత్, అమెరికా రక్షణ సహకారంపై చర్చించారు. భారత్-అమెరికా రక్షణ సహకారంలో భాగంగా స్ట్రైకర్ సాయుధ వాహనం(Stryker Armoured Vehicles), హోవిట్జర్‌లు, MQ-9 రీపర్ డ్రోన్లు, GE-F414 ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల తయారీకి సాంకేతికత సహకారం, M777ని కూడా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఢిల్లీ, వాషింగ్టన్ అధికారులు తెలిపారు.
ఢిల్లీ, వాషింగ్టన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..స్ట్రైకర్, M777 లైట్ వెయిట్ హోవిట్జర్ అప్‌గ్రేడేషన్‌పై తుది నిర్ణయం US అందించే షరతులపై ఆధారపడి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో రక్షణవ్యవస్థకు సంబంధించిన పరికరాల ఒప్పందం ముఖ్యమైనదికాగా..భారత్‌లో 2.7 బిలియన్ డాలర్ల చిప్ ప్లాంట్ కోసం మైక్రోన్‌తో ఒప్పందం, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పలు కీలక అంశాలపై ఈ పర్యటనలో ఒప్పందాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్‌తో తయారు చేయబడిన స్ట్రైకర్ అనేది ఎనిమిది చక్రాల V-హల్ సాయుధ పదాతిదళ వాహనం. ఈ స్ట్రైకర్‌లో 30 mm ఫిరంగి, 105 mm మొబైల్ గన్‌తో ఆయుధాలు ఉంటాయి. దీనిని ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌లను ఎదుర్కోవడానికి US సైన్యం వినియోగించింది. యూఎస్ దీనిని భారత్ అందిస్తోంది. ఆత్మ నిర్భర్‌లో భాగంగా భారత్ దీనిని స్వదేశీ తయారీపై ఆసక్తి చూపుతోంది.