Share News

warm light : వార్మ్‌ లైట్‌తో రీడింగ్‌లో కంటికి హాయి

ABN , First Publish Date - 2023-12-09T03:35:58+05:30 IST

రీడింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌కు సంబంధించి కిండిల్‌ పేపర్‌ వైట్‌కు చెందిన వార్మ్‌లైట్‌ ఫీచర్‌ కాస్తా గేమ్‌ చేంజర్‌గా మారనుంది. ముఖ్యంగా రాత్రి పూట చదివేవారికి మరింత

warm light : వార్మ్‌ లైట్‌తో రీడింగ్‌లో కంటికి హాయి

రీడింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌కు సంబంధించి కిండిల్‌ పేపర్‌ వైట్‌కు చెందిన వార్మ్‌లైట్‌ ఫీచర్‌ కాస్తా గేమ్‌ చేంజర్‌గా మారనుంది. ముఖ్యంగా రాత్రి పూట చదివేవారికి మరింత సౌకర్యం దీంతో సమకూరనుంది. లేటెస్ట్‌ మోడల్‌ను పొందితే చాలు, ఏమాత్రం కష్టపడకుండా, చివరకు మేన్యువల్‌ సర్దుబాటు కూడా లేకుండా పని చేసుకోవచ్చు. కంటి ఆరోగ్యానికి సంబంధించి ఇదో ప్రాక్టికల్‌ చాయిస్‌. సుదీర్ఘంగా కొనసాగే బ్లూ లైట్‌తో కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. అదే ఈ వార్మ్‌లైట్‌తో ఒత్తిడి తగ్గుతుంది. తదుపరి హాయిగా పడుకోవచ్చు. కిండిల్‌ స్ర్కైబ్‌(2002), కిండిల్‌ పేపర్‌వైట్‌ 5(2021) - 11వ జనరేషన్‌, కిండిల్‌ ఒయాసిస్‌ 3(2019) - 10వ జనరేన్‌ - మోడల్స్‌ వార్మ్‌లైట్‌ ఫీచర్‌ని సపోర్ట్‌ చేస్తాయి.

వార్మ్‌లైట్‌ కోసం

  • కిండిల్‌ స్ర్కీన్‌ టాప్‌పై టాప్‌ చేయాలి. దాంతో క్విక్‌ టోగెల్స్‌, బ్రైట్‌నెస్‌ సెట్టింగ్స్‌ బటపడతాయి. ప్రస్తుతం బుక్‌ చదువుతుంటే రెండో సారి అదనపు ఆప్షన్స్‌ని టాప్‌ చేయాలి.

  • షెడ్యూల్‌ సెట్టింగ్స్‌ కోసం షెడ్యూల్‌ ఆప్‌ బటన్‌ని టాప్‌ చేయాలి.

  • షెడ్యూల్‌ పక్కన ఆఫ్‌ స్లయిడర్‌ను టోగెల్‌ చేస్తే ఫంక్షన్‌ యాక్టివేట్‌ అవుతుంది.

  • ఆటోమెటిక్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే సమయానుకూలంగా ఉదయం, సాయంత్రం వార్మర్‌ కలర్‌ అడ్జస్ట్‌ అవుతుంది. లొకేషన్‌ యాక్సెస్‌ ఇందులో చాలా ముఖ్యం. మాన్యువల్‌లో స్టార్‌ - ఎండ్‌ టైమ్స్‌ని సెట్‌ చేసుకోవాలి.

  • వార్మ్‌ లెవెల్‌ కోసం(0-24) సెట్టింగ్‌కు స్లయిడర్‌ను ఉపయోగించుకోవాలి.

  • ఒకసారి కాన్ఫిగర్‌ అయితే చాలు, ఆటోమెటిక్‌ అడ్జస్ట్‌మెంట్‌ కుదురుతుంది. మొత్తమ్మీద ఈ ఫీచర్‌తో చదవడాన్ని బాగా ఎంజాయ్‌ చేయవచ్చు.

Updated Date - 2023-12-09T03:35:59+05:30 IST