Heart Attacks: మగాళ్లూ.. బీ కేర్‌ఫుల్.. సడన్‌గా వస్తున్న గుండె పోటుకు అసలు కారణాలు ఇవేనట..!
ABN , First Publish Date - 2023-06-02T14:46:59+05:30 IST
ఈ అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ గుండెకు చాలా చెడ్డవి, ఇవి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని పెంచుతాయి.
కొవిడ్ తరవాత గుండెజబ్బులు చిన్నా, పెద్దా బేధం లేకుండా అందరికీ కనిపిస్తున్నాయ్.. ఆ కారణంగా ప్రాణాలను పోగొట్టున్నవారే ఎక్కువ. అప్పటి వరకూ సరదాగా ఉండి, సడెన్‌గా గుండె నొప్పితో ప్రాణాలు విడుస్తున్నారు. ఇదే కారణంతో ఇటీవలి కాలంలో పలువురు ప్రముఖులు గుండెపోటుతో కన్నుమూశారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నవారిని చూసి యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఇందులో ప్రముఖంగా నితేష్ పాండే, సిద్ధార్థ్ శుక్లా వంటి చాలా మంది తారలు 40 ఏళ్లు లేదా 50 ఏళ్ల ప్రారంభంలో గుండెపోటుతో మరణించారు. 40, 50 అనేకాదు.. 20, 30 ఏళ్ళవారూ ఆ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోయారు.
50 ఏళ్లలోపు పురుషులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందా?
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, భారతీయ పురుషులలో 50% గుండెపోటులు 50 ఏళ్లలోపు సంభవిస్తున్నాయి. ఈ పరిశోధన, అధ్యయనాల ప్రకారం, యువకులలో గుండెపోటులు పెరుగుతున్నాయి. దేశంలో 5గురిలో ఒకరు గుండెపోటు కారణంగా చనిపోయే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అంటే ఎటువంటి హెచ్చరిక, లక్షణాలు లేకుండా గుండె పనిచేయడం మానేస్తుంది.
50 ఏళ్లలోపు పురుషులకు గుండెపోటు ఎందుకు వస్తుంది?
అన్నింటిలో మొదటిది, గుండె జబ్బులు ప్రధాన జన్యుపరమైన కారణాన్ని కలిగి ఉంది, అంటే కుటుంబంలో కొన్ని తరాలుగా గుండె జబ్బులు ఉంటే, ఆ కుటుంబంలో ఎవరికైనా ఆ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న వయసులోనే గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే, సమతుల్య జీవనశైలిని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరిస్తే ఈ ప్రమాదాన్ని కాస్త నివారించవచ్చు.
మధుమేహ వ్యాధి
మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండెపోటు ప్రమాదం ఇతర వ్యక్తుల కంటే చాలా ఎక్కువ. గణాంకాల ప్రకారం, భారతదేశంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 77 మిలియన్ల మంది మధుమేహంతో జీవిస్తున్నారు. 25 మిలియన్ల మంది ప్రజలు ప్రీ-డయాబెటిక్ ఉన్నారు. అంటే అలాంటి వారికి మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.
ఇది కూడా చదవండి: కొత్తగా పెళ్లయిన వాళ్లయినా.. రెండో ప్రెగ్నెన్సీ కోసం వెళ్లినా.. భార్యాభర్తలకు డాక్టర్లు తప్పకుండా చేసే 5 టెస్టులివే..!
అధిక తీవ్రతతో వ్యాయామం
యువతలో గుండె ఆగిపోయే ప్రమాదానికి హై ఇంటెన్సిటీ వర్కవుట్‌లు, జిమ్మింగ్‌లు ప్రధాన కారణాలలో ఒకటి. జిమ్‌కి వెళ్లడం అనేది ఆరోగ్యకరమైన జీవితంలో భాగం, కానీ చాలా ఎక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలు హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించలేనంతగా పెంచుతాయి, ఇది ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది.
అధిక కొలెస్ట్రాల్
భారతదేశంలో అత్యధిక సంఖ్యలో గుండెపోటు రావడానికి రెండవ ప్రధాన కారణం కొలెస్ట్రాల్ స్థాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం, భారతీయుల శరీరం జన్యుపరంగా చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోయే అవకాశం ఉంది. ఈ అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ గుండెకు చాలా చెడ్డవి, ఇవి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని పెంచుతాయి.
జీవనశైలి
రోజంతా ఒకేచోట ఉండిపోవడం, పెద్దగా కదలికలు లేకపోవడం, అధికంగా కొలస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, మధ్యపానం, ధూమపానం, సరైన నిద్ర లేకపోవడం ఇటువంటివన్నీ గుండెజబ్బులు పెరగడానికి సోమరి జీవనశైలికి ఒక కారణం. కోవిడ్ తర్వాత ఇంటి నుండి పని చేయడం, పెద్దగా కదిలే పని లేకపోవడం, ఒత్తిడితో కూడిన పనితీరు కారణంగా, చాలా మంది యువకులు గుండె జబ్బుల ప్రమాదానికి గురవుతున్నారు.