Seeds : ఈ విత్తనాలతో... ఆందోళన.. ఒత్తిడి చిత్తు

ABN , First Publish Date - 2023-02-19T02:54:04+05:30 IST

పొద్దు తిరుగుడు విత్తనాలు తినటం వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలున్నాయి. నూనె కోసం, మెడిసిన్‌లో ఈ విత్తనాలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా వీటిలో చక్కెర శాతం జీరో కావటం విశేషం.

Seeds : ఈ విత్తనాలతో... ఆందోళన.. ఒత్తిడి చిత్తు

  • పొద్దు తిరుగుడు విత్తనాలు తినటం వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలున్నాయి. నూనె కోసం, మెడిసిన్‌లో ఈ విత్తనాలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా వీటిలో చక్కెర శాతం జీరో కావటం విశేషం.

  • విటమిన్‌ బి6, మాంగనీసు, పాస్ఫరస్‌, జింక్‌, సెలీనియమ్‌ ఉండటం వల్ల శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడతాయివి. అలర్జీలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచుతాయి ఈ విత్తనాలు.

  • వీటిలో సోడియం, మెగ్నీషియమ్‌, పొటాషియం ఉండటం వల్ల బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తాయి. తద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.

  • ఒక ఔన్సు పొద్దు తిరుగుడు విత్తనాల్లో 164 కేలరీలుంటాయి. ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల ఇవి ఎనర్జీకి పవర్‌హౌస్‌గా ఉపయోగపడతాయి.

  • వీటిలోని పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎంజైమ్స్‌ వల్ల క్యాన్సర్‌ కణుతులు రాకుండా చేస్తాయి.

  • జింక్‌, కాపర్‌, మాంగనీసు ఉండటం వల్ల ఇవి తింటే ఎముకలకు మంచిది. కండరాలు వృద్ధి చెందుతాయి.

  • మెంటల్‌ హెల్త్‌కు మంచిది. మూడ్‌ స్వింగ్‌ను నియంత్రించడం, జ్ఞాపకశక్తి పెరుగుదలతో పాటు ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతాయి.

  • వీటిలో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువ ఉండటం వల్ల సులువుగా జీర్ణమవుతుంది.

  • జుట్టు పెరగాలన్నా, చర్మంలో మృదుత్వం రావాలన్నా పొద్దు తిరుగుడు విత్తనాలను ఆశ్రయించాల్సిందే. జుట్టు రాలకుండా చేస్తాయి.

  • అలాగని అధికంగా ఈ విత్తనాలను తినటం కూడా మంచిది కాదు. దీనివల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణులు ఈ ఆహారానికి దూరంగా ఉండాలి.

Updated Date - 2023-02-19T02:54:05+05:30 IST