Share News

Prevent Makeup From Smudging: వేసవిలో చెమటకు చెదరకుండా

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:51 AM

వేడి, ఉక్కపోతల కారణంగా మేకప్‌ చెదిరిపోవడం సహజం. ఎన్నో జాగ్రత్తలు తీసినా, టిష్యూతో అద్దుకున్నా మేకప్‌ పూర్తిగా నిలబడదు

Prevent Makeup From Smudging: వేసవిలో చెమటకు చెదరకుండా

మేకప్‌

వేడి, ఉక్కపోతలకు మేకప్‌ చెదిరిపోవడం సహజం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్నిసార్లు టిష్యూతో అద్దుకున్నా ఎంతో కొంత మేకప్‌ అటూ ఇటూ చెదిరిపోతూనే ఉంటుంది.

ఇలా జరగకుండా ఉండాలంటే...

ముఖం శుభ్రంగా ఉంచుకోవాలి

ముఖాన్ని సబ్బుతో శుభ్రపరుచుకున్న తర్వాత టవల్‌తో రుద్దకుండా, సున్నితంగా అద్దుకోవాలి. తర్వాత తేలికపాటి మాయిశ్చరైజింగ్‌ జెల్‌ లేదా లోషన్‌ను పూసుకోవాలి. ఆ తర్వాత అదనపు చర్మ నూనెలు, మాయిశ్చరైజర్‌ను బ్లాటింగ్‌ పేపర్‌ అద్దుకుని తొలగించాలి.

ప్రైమర్‌ వాడుకోవాలి

మేక్‌పకు ముఖాన్ని సిద్ధం చేసుకునేటప్పుడు మొదట ప్రైమర్‌ అప్లై చేయాలి. ఫేస్‌, ఐ ప్రైమర్‌లను వాడుకోవడం వల్ల చర్మం నునుపుగా మారి, ఫౌండేషన్‌ పూతకు తగ్గట్టు తయారవుతుంది.

ఫౌండేషన్‌ పలుచగా

వేసవి వేడి వాతావరణంలో ఫౌండేషన్‌ భారీగా వేసుకుంటే అది ముద్దలుగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాయిశ్చరైజర్‌, ప్రైమర్‌ పలుచగా పూసుకున్న తర్వాత ఫౌండేషన్‌ కూడా వీలైనంత పలుచగా అప్లై చేసుకోవాలి.

సెట్టింగ్‌ స్ర్పే

సెట్టింగ్‌ స్ర్పేతో వేసుకున్న మేకప్‌ ముఖం మీద నిలిచి ఉంటుంది. మేకప్‌ పూర్తయిన తర్వాత సెట్టింగ్‌ స్ర్పే వాడుకుని, అది ముఖం మీదే ఆరిపోయేలా చూసుకోవాలి.


ఫిక్సింగ్‌ పౌడర్‌

ఈ కాలంలో కాంపాక్ట్‌ పౌడర్‌ నుంచి ట్రాన్స్‌క్యులెంట్‌ పౌడర్‌కు మారాలి. చెమట పట్టినప్పుడు కాంపాక్ట్‌ పౌడర్‌ చెక్కిళ్ల పైనుంచి కారిపోయి చారికలు ఏర్పడతాయి కాబట్టి వేసవిలో ఈ పౌడర్‌ వాడకం మానేయాలి.

వాటర్‌ప్రూఫ్‌

వాటర్‌ప్రూఫ్‌ మస్కారా, కాజల్‌, ఐలైనర్‌లను ఎంచుకోవాలి. సాధారణ ఉత్పత్తులతో పోల్చుకున్నప్పుడు వీటిని తొలగించడం కాస్త ఇబ్బందికరమే అయినప్పటికీ మేకప్‌ అందవిహీనంగా మారిపోకుండా ఉండడం కోసం వేసవిలో వాటర్‌ప్రూఫ్‌ సౌందర్య సాధనాలనే వాడుకోవాలి.

Updated Date - Mar 29 , 2025 | 04:52 AM