Share News

Leafy Vegetable Health Benefits: అమృతాహారం చుక్కకూర

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:34 AM

చుక్కకూరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది, అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది

Leafy Vegetable Health Benefits: అమృతాహారం చుక్కకూర

  • భోజనకుతూహలం

  • ఆహారంతో ఆరోగ్యం

మనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆకుకూరల్లో- చుక్కకూరకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడైతే పులుపు కావాలనుకుంటే చింతపండును ఉపయోగిస్తాం. కానీ ఒకప్పుడు మన పూర్వీకులు పులుపు కోసం చుక్కకూరనే ఉపయోగించేవారు. మన ఆయిర్వేద గ్రంథాల్లో చుక్కకూరకు ఉన్న గుణగణాలను.. దాని వల్ల కలిగే లాభాలను వివరించారు. ఆ లాభాలేమిటో చూద్దాం..

  • చుక్కకూరలో అనేక విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. దీనిని ప్రతి రోజు తీసుకుంటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీనిలో కొన్ని రకాలైన రసాయనాలు ఉంటాయి. ఇవి విష దోషాల నివారణకు ఉపకరిస్తాయి.

  • చుక్క కూరను ఆయిర్వేద ఔషధాల తయారీకి కూడా వినియోగిస్తారు.

  • చుక్క కూర పేగులను శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది. పచ్చకామెర్లు లాంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా చుక్కకూరను తినవచ్చు. దీనిలో క్షార గుణాలున్న ఫ్లవనాయిడ్స్‌, ఫాలీఫినాల్స్‌ ఉండటం వల్ల కడుపులో మంట కలిగించదు.

  • ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త సమృద్ధికి ఉపకరిస్తుంది.

  • కూరల్లోను, పప్పుల్లోను చింతపండుకు బదులుగా చుక్కకూరను వాడుకోవచ్చు.


చుక్కకూరతో చారు...

చుక్కకూరతో తయారుచేసే చారు వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని క్రమం తప్పకుండా ప్రతి రోజూ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఏవైనా విషదోషాలు ఉంటే వాటి ప్రభావం తగ్గుతుంది. దీనిని ఎలా తయారుచేయాలో చూద్దాం..

  • చుక్కకూరను బాగా కడగాలి. దానిని మిక్సిలోకి వేసి బాగా తిప్పాలి. ఈ మిశ్రమాన్ని ఒక గుడ్డలో వేసి ఒడగట్టాలి. అప్పుడు వచ్చే రసాన్ని తీసి ఒక గిన్నెలో వేయాలి.

  • ఈ రసాన్ని కొద్దిగా వేడి చేసి చారుపొడి వేయాలి. ఆ తర్వాత తాళింపు పెట్టాలి.

  • కొందరు దీనిలో అల్లం, మిరియాల పొడి కూడా వేస్తారు. దీని వల్ల చుక్కకూర చారు మరింత రుచికరంగా ఉంటుంది.

- గంగరాజు అరుణాదేవి

Updated Date - Mar 29 , 2025 | 04:39 AM