YSRCP Manifesto : అమ్మ జగనా.. ఒకేసారి 100 జియో టవర్ల ప్రారంభం వెనుక ఇంత పెద్ద కథుందా.. ఈ విషయం బయటపడితే..?

ABN , First Publish Date - 2023-06-19T20:42:24+05:30 IST

మారుమూలకూ డిజిటల్ విప్లవం (Digital Revolution) పేరిట ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy) రాష్ట్రంలో ఒకేసారి 100 జియో సెల్ టవర్లు (100 Jio Cell Towers) ప్రారంభించడం వెనుక పెద్ద ప్లానే ఉందా..? పేరుకే డిజిటల్ విప్లవం అంటూ తెరవెనక పెద్ద కథే నడుస్తోందా..? అసలు ఈ టవర్ల ద్వారా జగన్‌కు.. బిలియనీర్ ముకేష్ అంబానికి వచ్చే లాభమేంటి..? ఆంధ్రాను కాస్త జియో ఆంధ్రగా (Jio Andhra) మార్చడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారా..? ..

YSRCP Manifesto : అమ్మ జగనా.. ఒకేసారి 100 జియో టవర్ల ప్రారంభం వెనుక ఇంత పెద్ద కథుందా.. ఈ విషయం బయటపడితే..?

మారుమూలకూ డిజిటల్ విప్లవం (Digital Revolution) పేరిట ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy) రాష్ట్రంలో ఒకేసారి 100 జియో సెల్ టవర్లు (100 Jio Cell Towers) ప్రారంభించడం వెనుక పెద్ద ప్లానే ఉందా..? పేరుకే డిజిటల్ విప్లవం అంటూ తెరవెనక పెద్ద కథే నడుస్తోందా..? అసలు ఈ టవర్ల ద్వారా జగన్‌కు.. బిలియనీర్ ముకేష్ అంబానికి వచ్చే లాభమేంటి..? ఆంధ్రాను కాస్త జియో ఆంధ్రగా (Jio Andhra) మార్చడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారా..? ఏపీ ప్రజల డేటా సేఫ్‌గా లేదా..? చంద్రబాబును అడ్డుకునేందుకే ఈ మొత్తం వ్యవహారం జగన్ నడిపిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ అక్షరాలా నిజమే అనిపిస్తోంది. ఇంతకీ జగన్ ప్లానేంటి..? ఇన్నిరోజులు అదానీ.. అదానీ అన్నీ కట్టబెట్టేసిన జగన్ ఇప్పుడు అంబానీ పేరు ఎందుకు జపం చేస్తున్నారు..? అయినా ఈ ఇద్దరి మధ్య టీడీపీ అధినేత టాపిక్ ఎందుకొచ్చిందనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎక్స్‌క్లూజివ్ కథనంలో తెలుసుకుందాం..

Jio-Towers-Jagan.jpg

ఇదీ అసలు కథ..!

గిరిజనాభివృద్ధే లక్ష్యంగా నాలుగేళ్లుగా చిత్తశుద్ధితో పనిచేశామని ఊదరగొడుతున్న జగన్.. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో డిజిటల్ సేవలు విస్తరింపచేయాలనే ఉద్దేశంతో సెల్‌ఫోన్ (Cell phone)సేవలు, ఇంటర్నెట్ (Internet) కనెక్టివిటీ కోసం ఒకేసారి దేశంలో మునుపెన్నడూ లేని విధంగా 100 జియో టవర్లను ప్రారంభించారు. అయితే ఇదంతా పైకి అలా గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ లోలోపల మాత్రం కథ వేరే నడుస్తోందట. అసలు ఈ టవర్లు ఎవర్ని ఉద్దరించడానికి..? ఇన్ని టవర్లతో జనాలకు ఒరిగేదేముంది..? పోనీ ఉద్దరించాలంటే బీఎస్ఎన్‌లాంటి (BSNL) వాటిని తీసుకోవచ్చు కదా.. జియోనే ఎందుకు..? దేశంలో బహుశా ఎక్కడాలేని విధంగా ఇక్కడే ఇన్ని టవర్లు ఎందుకు..? అనే ప్రశ్నలు కొందరు మేధావుల నుంచి వస్తున్నాయి. దీనిపై కాస్త లోతుగా ఆలోచిస్తే.. ఇన్నిరోజులూ ఏపీలో ఏ ప్రాజెక్టును వదలకుండా బిలియనీర్ గౌతమ్ అదానీకే (Gautam Adani) కట్టబెట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడిక ముకేష్ అంబానీ (Mukesh Ambani) వంతు వచ్చిందేమో కానీ.. జియోకు సంబంధించిన ఇన్ని టవర్లు ప్రారంభించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Jagan-Jio.jpg

జగన్‌కు.. జియోకు ఏం లాభం..?

గిరిజన ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు వాడకం, ఇంటర్నెట్ వాడకం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ టవర్లు అందుబాటులోకి రావడం వల్ల జియో స్మార్ట్ ఫోన్లు, జియో సిమ్‌లు భారీగా అమ్ముడుపోతాయి. జియోలో సినిమాలు ఏమైనా చూడాలంటే తప్పకుండా ‘జియో సినిమా’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. ఇలా చేస్తే డేటా వాడకం పెరుగుతుంది తద్వారా సొమ్ము చేసుకోవచ్చన్నది అంబానీ ఆలోచనట. ముఖ్యంగా.. ఐపీఎల్‌ జియో సినిమాలో ప్రదర్శించడంతో అంబానీకి ఏ రేంజ్‌లో కాసుల వర్షం కురిసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగానే లైవ్ చూడటానికి అవకాశం ఇచ్చినప్పటికీ ప్రకటనలు ద్వారా కోట్లల్లో డబ్బులు వచ్చాయన్నది జగమెరిగిన సత్యమే. ఇప్పుడు ఏపీలో టవర్లు ప్రారంభంతో ఏపీ ప్రజల నుంచి పెద్దఎత్తున దండుకోవచ్చన్నది అంబానీ ఆలోచనట. ఇందుకు అన్నివిధాలుగా జగన్ సహకరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Jagan-and-Adani.jpg

రిటర్న్ గిఫ్ట్‌గా..!

- అదేవిధంగా జియోను ఫైబర్‌నెట్‌కు అనుసంధానం చేస్తే ఏ రేంజ్‌లో జనాలు కనెక్షన్లు తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మధ్య రిలీజ్ అయ్యే ప్రతిసినిమా ఫైబర్‌నెట్‌లో ఫస్ట్ డే.. ఫస్ట్ షో థియేటర్లలో పడుతున్నట్లుగా ఫైబర్‌నెట్ ద్వారా ఇంట్లోనే చూసేలా సాంకేతిక ఏర్పాట్లను ఏపీ సర్కార్ చేసింది. ఇది ఇంకా వంద శాతం అమలు కాలేదు కానీ.. ఇది అంతటా వ్యాపిస్తే జియో పరిస్థితి ఎలా ఉంటుంది..? టాలీవుడ్ సంగతేంటి..? అనేది ప్రశ్నార్థకమే..!. జగన్ తనకోసం ఇన్ని చేశారు కాబట్టి.. ఇందుకు రిటర్న్ గిఫ్ట్‌గా రానున్న ఎన్నికల్లో జగన్‌కు భారీగా నిధులు సమకూర్చబోతున్నారని కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్‌లో ఏ యాప్ ఇన్‌స్టాల్ చేయాలనుకున్నా కచ్చితంగా డీటైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు జియో చేతిలో ఏపీ ప్రజల డేటా దాదాపు ఇరుక్కుపోయినట్లే..! జగన్ నిర్ణయంతో రానున్న రోజుల్లో ఆంధ్రా కాస్త జియో ఆంధ్రగా మారిపోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Jagan-and-Ambani.jpg

బాబును ఎదుర్కోవడానికి.. జగన్ ప్లాన్ ఇదా..!

2019 ఎన్నికల్లో నవరత్నాలు (Navartnalu) అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. అవి ఎంతమేరకు అమలు చేశారన్నది ఆయనకే తెలియాలి. అయితే.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి ఏం చేయాలి..? ఏం చెప్పి ఎన్నికలకు వెళ్లాలి..? మేనిఫెస్టోలో (YSRCP Manifesto) ఏమేం పెట్టాలి..? అనేది జగన్‌కు దిక్కుతోచట్లేదట. ఓ వైపు ఏపీలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం, మరోవైపు రోజురోజుకూ వైసీపీకి గ్రాఫ్ (YSRCP Graph) తగ్గిపోతుండటంతో ఏం చేయాలో జగన్‌కు దిక్కుతోచట్లేదట. ఈ పరిస్థితుల్లో జనాలను మెప్పించడానికి ఏం ప్లానుందబ్బా అని ఆలోచించగా.. జియో టవర్స్ గుర్తొచ్చాయట. ఆలోచన వచ్చిందే ఆలస్యం వెంటనే 100 టవర్లను వర్చువల్‌గా ప్రారంభించేశారట. ప్రతి ఒక్కరి చేతిలో ప్రస్తుతం సెల్‌ఫోన్ కామన్ అయిపోయింది.. అందుకే అంబానీ సహకరంతో రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ఉచితంగా రీచార్జీలు (Free Recharge), ఫ్రీ వైఫై సేవలు (Free Wifi) , ఫైబర్‌నెట్ (Fibernet) సేవలన్నీ అందించడానికి సిద్ధమవుతున్నట్లుగా విశ్వసనీయవర్గాల సమాచారం. ఎందుకంటే.. ఇప్పటికే మిని మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు ప్రకటించగా.. అంతకుమించి చేయాలంటే ఉచిత రీచార్జ్ పథకంతో కొట్టాలన్నది జగన్ ప్లానట. అందుకే ఏం చేసినా టీడీపీ మేనిఫెస్టో‌కు మించి కలర్‌ఫుల్‌గా ఉండాలని జగన్ భావిస్తున్నారట. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోను తెలుగు తమ్ముళ్లు జనాల్లోకి విస్తృుతంగా తీసుకెళ్తున్నారు. త్వరలోనే మరో మేనిఫెస్టోను టీడీపీ రిలీజ్ చేయనుంది. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే ఇప్పుడు నవరత్నాలు అస్సలు పనికిరావని పసిగట్టిన జగన్.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ అని ప్రకటించబోతున్నారట.

Jagan-Vs-Chandrababu.jpg

మొత్తానికి చూస్తే.. బాబును తట్టుకోవడం చేతగాక అంబానీతో జగన్ చేతులు కలిపారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయాలన్నింటినీ ఏపీ ప్రజలు గ్రహించి.. ఏ పార్టీవైపు అడుగులేస్తారో ఏంటో మరి. చూశారుగా.. రానున్న ఎన్నికల్లో వైసీపీ భారీగానే ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ ఏ మాత్రం వర్కువుట్ అవుతాయో.. వీటన్నింటినీ తిప్పికొట్టడానికి చంద్రబాబు ఇంకేరేంజ్‌లో వ్యూహాలు రచిస్తారో వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


TS Politics : అవును అవినీతి పెరిగిపోయింది.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు.. సడన్‌గా ఎందుకిలా..!?


Rakesh Master : కంటతడి పెట్టిస్తున్న రాకేశ్ మాస్టర్ వీడియో.. శిష్యుడితో ఏం చెప్పారో విన్నాక..


Tollywood : రాకేష్ మాస్టర్ మృతికి కారణాలేంటో చెప్పిన డాక్టర్స్..


Telugudesam : ఉంటే ఉండండి.. లేకుంటే తప్పుకోండి.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈ ఒక్క మాటతో..



Updated Date - 2023-06-22T18:43:15+05:30 IST