Martyrs Memorial : కాసేపట్లో కేసీఆర్ చేతుల మీదుగా ‘అమరుల స్మారక చిహ్నం’ ప్రారంభం.. సడన్‌గా ఇలా జరిగిందేంటి..?

ABN , First Publish Date - 2023-06-22T18:35:57+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్‌ (CM KCR) ‘అమరుల స్మారక చిహ్నాన్ని’ (Martyrs Memorial) మరికాసేపట్లో ప్రారంభించబోతున్నారు..

Martyrs Memorial : కాసేపట్లో కేసీఆర్ చేతుల మీదుగా ‘అమరుల స్మారక చిహ్నం’ ప్రారంభం.. సడన్‌గా ఇలా జరిగిందేంటి..?

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్‌ (CM KCR) ‘అమరుల స్మారక చిహ్నాన్ని’ (Martyrs Memorial) మరికాసేపట్లో ప్రారంభించబోతున్నారు. వేలాది మందితో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి అమరుల స్మారకం వరకు భారీ ర్యాలీ కూడా జరిగింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సరిగ్గా సాయంత్రం 6:30 గంటలకు స్మారక చిహ్నాన్ని కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. ఇక్కడివరకూ అంతా ఓకేగానీ.. ప్రారంభానికి ముందు అమరవీరుల స్మ్రుతి చిహ్నంపై ‘గద్ద’ (Owl) వాలింది. దీంతో ఇది శుభ శకునమా..? లేక అశుభమా..? అంటూ సందర్శకులు ముచ్చటించుకుంటున్నారు. అసలే కేసీఆర్‌‌కు నమ్మకాలు, పట్టింపులు ఎక్కువని ఆయన అత్యంత సన్నిహితులు చెబుతుంటారు. ఏదైనా కార్యక్రమానికి ముందు.. ఏ టైమ్‌లో ప్రారంభించాలి..? ఏ రోజున ప్రారంభించాలి..? ఇలా అన్ని కోణాల్లో అడిగితెలుసుకుని మరీ వేదపండితుల సమక్షంలో ప్రారంభిస్తుంటారు. అలాంటిది.. ఇప్పుడు ప్రారంభానికి ముందు గద్ద వాలడంతో ఏం జరుగుతుందో ఏమో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకింత ఆందోళన మొదలైందట.

Gadda.jpg

అసలేం జరిగింది..?

స్మారక చిహ్నం నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేయగా పూర్తి కావడానికి ఆరేళ్లు పట్టింది. అసలే అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవట్లేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ప్రారంభించాలని కేసీఆర్ భావించి ముహూర్తం ఫిక్స్ చేయగా ఇలా జరగడం గమనార్హం. అయితే.. 5:45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గద్దల గుంపు ఎగిరిగింది.. కానీ ఒక గద్ద మాత్రం సరిగ్గా ఆ చిహ్నంపైనే కూర్చొని అలాగే ఉండిపోయింది. మిగిలినవన్నీ అటు ఇటు తిరుగుతున్నప్పటికీ.. ఆ ఒక్కటి మాత్రం అక్కడ్నుంచి అస్సలు కదల్లేదు. దీంతో అక్కడికొచ్చిన వీక్షకులు ఈ విషయాన్ని గమనించారు. బాబోయ్.. గులాబీ బాస్‌కు అసలే నమ్మకాలెక్కువ.. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందబ్బా..? అసలు ఇది శుభమా..? అ శుభమా..? అని చర్చించుకుంటున్నారు. ఇక మీడియా మిత్రులకు ఈ విషయం తెలియడంతో ఈ దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎవరికితోచినట్లుగా వారు నెటిజన్లు, సామాన్యులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Owl.jpg

అప్పుడలా.. ఇప్పుడిలా..?

ఆ మధ్య కొత్త సచివాలయం ప్రారంభించిన ఒకట్రెండ్రోజుల్లోనే గరుడ పక్షులు వాలాయని.. అది కూడా పెద్ద గుమ్మటాల మీద వాలడంతో చిత్రవిచిత్రాలుగా కథనాలు వచ్చాయి. అయితే ఆ పక్షుల వల్ల ఎలాంటి అపాయం కలగలేదు.. రెండ్రోజులు ఉద్యోగులు కాసింత భయపడినా ఆ తర్వాత యథావిధిగా కార్యకలాపాలు సాగాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉంటాయని.. ఇందులో అశుభం, శుభం అనేది ఏమీ ఉండదని పక్షులు అనేవి ఎగరకుండానే.. ఎక్కడా వాలకుండా ఉంటాయా..? అని విశ్లేషకులు చెబుతున్నారు. మరికొందరు ఆకాశంలో ఎగిరే పక్షులు విశ్రాంతి కోసం అలా స్మారక చిహ్నంపై వాలుంటాయే తప్ప.. ఇందులో ఎలాంటి అపోహలు, ఆలోచనలు అక్కర్లేదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. నాడు అలా జరగడం.. నేడు ఇలా జరగడంపై ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉంటుందో లేదో చూడాలి మరి.

Owl-At.jpg


ఇవి కూడా చదవండి


YSRCP Manifesto : అమ్మ జగనా.. ఒకేసారి 100 జియో టవర్ల ప్రారంభం వెనుక ఇంత పెద్ద కథుందా.. ఈ విషయం బయటపడితే..?


TS Politics : ప్చ్.. ఈటల రాజేందర్ కనిపించట్లేదు.. ఆ భేటీ తర్వాతే ఇదంతా.. బీజేపీకి దూరమవుతున్నారా..!


TS Congress : సోదరుడు, శిష్యుడితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంతనాలు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే..!


Kapu Politics : ద్వారంపూడిని పవన్ తిడితే ముద్రగడ రియాక్ట్ కావడమేంటి.. ఈ ఒక్క లేఖతో ఫుల్ క్లారిటీ వచ్చేసిందోచ్..!




Updated Date - 2023-06-22T18:42:03+05:30 IST