KCR Vs Ponguleti : ప్చ్.. ‘తెల్లం’ షాక్ నుంచి తేరుకోక ముందే పొంగులేటికి మరో ఝలక్.. బీఆర్ఎస్‌లోకి మరో ముఖ్యనేత..!?

ABN , First Publish Date - 2023-08-18T21:27:28+05:30 IST

మాజీ ఎంపీ, ఖమ్మం కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని (Ponguleti Srinivasa Reddy).. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) టార్గెట్ చేశారా..? ఇన్నాళ్లు అధికార పార్టీలో ఉండి.. రెబల్‌గా మారి కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకున్న పొంగులేటి..

KCR Vs Ponguleti : ప్చ్.. ‘తెల్లం’ షాక్ నుంచి తేరుకోక ముందే పొంగులేటికి మరో ఝలక్.. బీఆర్ఎస్‌లోకి మరో ముఖ్యనేత..!?

మాజీ ఎంపీ, ఖమ్మం కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని (Ponguleti Srinivasa Reddy).. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) టార్గెట్ చేశారా..? ఇన్నాళ్లు అధికార పార్టీలో ఉండి.. రెబల్‌గా మారి కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకున్న పొంగులేటి.. కేసీఆర్‌ను గద్దె దించడమే ఏకైక లక్ష్యమన్న కామెంట్స్‌ను బాస్ సీరియస్‌గా తీసుకున్నారా..? ఉమ్మడి ఖమ్మం (Khammam District) జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురేస్తానని పదే పదే పొంగులేటి చెబుతుండటాన్ని బాస్ సవాల్‌గా తీసుకున్నారా..? ఇందుకోసం పక్కా వ్యూహాత్మకంగా కేసీఆర్ ముందుకెళ్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ కేసీఆర్ ప్లానేంటి..? ఖమ్మం జిల్లానే కేసీఆర్ ఎందుకింత సీరియస్‌గా తీసుకున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..


Tellam.jpg

ఇదీ అసలు కథ..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నాయి. కేసీఆర్ వ్యూహాలకు కాంగ్రెస్ ప్రతివ్యూహాలు రచిస్తుంటే.. అంతకుమించి టార్గెట్ చేస్తున్నారు గులాబీ బాస్. అందుకే బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసిన.. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించిన నేతల భరతం పట్టేందుకు సిద్ధమైనట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే ఎక్కడైతే పార్టీ వీక్‌గా ఉందో అక్కడ్నుంచే కేసీఆర్ దండయాత్ర మొదలెట్టారట. ముందుగా ఖమ్మం జిల్లాలో పట్టు సాధించడానికి వ్యూహాలు సిద్ధం చేశారట. ఇందులో భాగంగానే జిల్లాలో కీలకంగా ఉన్న పొంగులేటిని టార్గెట్ చేయడం.. ఆయనకు అత్యంత ఆప్తులు, ప్రధాన అనుచరులుగా ఉన్నవారిని కారెక్కించడానికి ప్లాన్ చేశారట కేసీఆర్. మొదట.. పొంగులేటి ముఖ్యఅనుచరుల్లో ఒకరు, భద్రాచలం నియోజకవర్గానికి చెందిన తెల్లం వెంకట్రావ్‌ను (Tellam Venkatrao) తిరిగి పార్టీలోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌తోపాటు పలువురు ముఖ్యనేతల సమక్షంలో తెల్లం వెంకట్రావ్ గురువారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ‘నా మనిషి’ అనుకున్న తెల్లం సడన్‌గా హస్తాన్ని వీడి.. కారెక్కుడంతో పొంగులేటి కంగుతిన్నారు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే మరో ఊహించని షాక్ తగిలింది.

Tati-Venkateswarlu.jpg

ఇవాళ ఏం జరిగిందంటే..?

జులై మొదటి వారంలో అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో పొంగులేటితో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారిలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు (Thati Venkateswarlu) కూడా ఉన్నారు. అయితే.. పార్టీలో చేరి పట్టుమని రెండు నెలలు కూడా గడవక ముందే ఆ పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలోపొంగులేటిపై సంచలన వ్యాఖ్యలే చేశారు. దీంతో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పడం పక్కా అని అర్థం చేసుకోవచ్చు. ‘కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఆశావహులు ఉన్నారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరడం బోనస్ పాయింట్స్ లాగా కలిసొస్తుంది అని అనుకున్నాం.. కానీ ఇబ్బందులు ఎదురయ్యాయి. పొంగులేటి.. నువ్వు పార్టీని బాగు చేయడానికి వచ్చావా లేకుంటే నాశనం చేయడానికి వచ్చావా..?. పొంగులేటి అనుచరుల పోకడలు వల్ల పార్టీలో, క్రమశిక్షణ లేకుండా పోయింది. గ్రూపులు ఎక్కువ అయ్యాయి’ అని తాటి టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే.. తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే తాటి వెంకటేశ్వర్లు ఇలా కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా అటు కాంగ్రెస్‌లో.. ఇటు బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.

Tati-Venkateswarlu.jpg

కారణమిదే..!

తాటి ఏకంగా పొంగులేటినే టార్గెట్ చేయడం వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరే ప్రయత్నంలోనే అసమ్మతి వ్యాఖ్యలు చేశారని పొంగులేటి వర్గీయుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈయన 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫునే అశ్వరావుపేట నుంచి పోటీచేశారు. అయితే టీడీపీ తరఫున పోటీచేసిన మెచా నాగేశ్వరరావుపై 13,117 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత గెలిచిన నాగేశ్వరరావు కూడా సైకిల్ దిగి కారెక్కేశారు. అయితే పొంగులేటి వర్గం కావడంతో ఆయన బీఆర్ఎస్‌కు రెబల్ కావడం.. ఈయన కూడా పార్టీ నుంచి బయటికి రావడంతో అధికార పార్టీకి దూరమయ్యారు. తాజా వ్యాఖ్యలు.. ఖమ్మంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే.. తాటి కూడా కారెక్కడానికి సర్వం సిద్ధం చేసుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక గులాబీ కండువా కప్పుకోవడమే ఆలస్యమన్న మాట. మొత్తానికి చూస్తే.. పొంగులేటిని ఒంటరిని చేయడానికి కేసీఆర్ గట్టిగానే ప్లాన్ చేశారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఈ ఇద్దరు మున్ముందు ఇంకెంత మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారో ఏంటో!. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ వ్యూహాలకు పొంగులేటి ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి మరి.

Thati-And-KCR.jpg


ఇవి కూడా చదవండి


TS Politics : గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీ బరిలో గుమ్మడి నర్సయ్య కుమార్తె..!?


TS Congress : గద్దర్ చివరికోరిక నెరవేరస్తున్న రేవంత్ రెడ్డి.. సూర్య కోసం పరిశీలనలో రెండు నియోజకవర్గాలు..!?


RajyaSabha : రాజ్యసభకు ఈసారి ‘కేకే’ డౌటే.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే..!?


TS Assembly Elections 2023 : కేసీఆర్ ప్రకటించబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే.. 10 ఉమ్మడి జిల్లాలకు ఫిక్స్..!?


TS Politics : తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. ఒకేసారి బీజేపీలోకి 22 మంది ముఖ్య నేతలు..!?



Updated Date - 2023-08-18T21:33:14+05:30 IST