YSRCP : బాలినేనిని వైఎస్ జగన్ బుజ్జగించి, బటన్ నొక్కించిన తర్వాత కూడా.. సడన్‌గా ఇలా మాట్లాడేశారేంటి..!?

ABN , First Publish Date - 2023-04-13T20:43:16+05:30 IST

అవును.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రకాశం జిల్లా పర్యటన ముగిసిన మరుసటి రోజే మాజీ మంత్రి, జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ విన్న అభిమానులు..

YSRCP : బాలినేనిని వైఎస్ జగన్ బుజ్జగించి, బటన్ నొక్కించిన తర్వాత కూడా.. సడన్‌గా ఇలా మాట్లాడేశారేంటి..!?

అవును.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రకాశం జిల్లా పర్యటన ముగిసిన మరుసటి రోజే మాజీ మంత్రి, జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ విన్న అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు అసలేం జరుగుతోందంటూ ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. అధిష్ఠానం సైతం సడన్‌గా బాలినేని ఎందుకిలా అన్నారబ్బా..? అని ఆలోచనలో పడిందట. ఇంతకీ బుధవారం నాడు జగన్ ప్రకాశం టూర్‌లో ఏం జరిగింది..? నిమిషాల వ్యవధిలోనే జగన్ ఏం చేశారు..? పర్యటన ముగిసిన మరుసటి రోజే బాలినేని చేసిన కామెంట్స్ ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..

Jagan-Tour.jpg

అసలేం జరిగింది..!?

వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా (Jagan Prakasam District Tour) మార్కాపురం పర్యటనలో ప్రొటోకాల్ (Protocol) రచ్చ జరిగింది. ప్రకాశం జిల్లాలో కీలక నేతగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) హెలీప్యాడ్ వద్ద కారుకు సెక్యూరిటీ అనుమతి నిరాకరించింది. కారు దిగి నడుచుకుంటూ వెళ్లాల్సిందేనని పోలీసులు చెప్పడంతో.. దీన్ని అవమానంగా భావించారు బాలినేని. అందరి కార్లను లోపలికి పంపి తన కారును పంపకపోవడంతో కోపగించుకుని హెలిప్యాడ్ దగ్గర్నుంచి ఒంగోలుకు బయల్దేరారు. ఈ ఘటనతో స్వయంగా రంగంలోకి దిగిన వైఎస్ జగన్.. బాలినేనిని బుజ్జగించారు. జగన్ ఫోన్‌తో (YS Jagan Phone Call) మళ్లీ తిరిగి మార్కాపురంకు బాలినేని తిరిగొచ్చారు. అప్పటి వరకూ ఆగ్రహంతో రగిలిపోతున్న మాజీమంత్రిని వేదికపైకి రాగానే చేయిపట్టుకుని మరీ బటన్ నొక్కించి కూల్ చేశారు జగన్. దీంతో ఈ ప్రొటోకాల్ వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది.

YS-Jagan-Tour.jpg

ఎందుకిన్ని మాటలు అన్నారో..!?

బాలినేని అలగడం, స్వయంగా జగన్ ఫోన్ చేసి బుజ్జగించి ‘ఈబీసీ నేస్తం’ (EBC Nestham) కార్యక్రమానికి పిలిపించడం, ఆ తర్వాత ఆయన చేయిపట్టుకుని మరీ బటన్ నొక్కించడం ఇవన్నీ నిన్నటితో అయిపోయాయి. ఇక ప్రోటోకాల్ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లే అని అందరూ అనుకున్నారు కానీ.. సడన్‌గా ఎందుకో బాలినేని హాట్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో మరోసారి మాజీమంత్రి వార్తల్లో నిలిచారు. జగన్ టూర్‌లో జరిగిన ఘటనపై స్పందించాలని శ్రీనివాసరెడ్డిని మీడియా ప్రతినిధులు అడిగారు. దీనిపై స్పందిస్తూ.. ‘ నేను గత 25 ఏళ్లుగా విలువలు గల రాజకీయాలను నడుపుతున్నా. విలువలు లేకపోతే నేను రాజకీయాలు నడపను. నేను ఒక్కటే చెబుతున్నా.. విలువల కోసం ఎంతవరకైనా పోరాడుతాను. అనవసర విషయాలకు వస్తే మాత్రం ఊరుకునే సమస్యే లేదు. ఎంతపెద్ద మగాడినైనా సరే ఎదిరిస్తాను. మళ్లీ చెబుతున్నా విలువలు గల రాజకీయాలను మాత్రం నేను చేస్తా’ అని బాలినేని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Jagan-and-Balineni.jpg

నెట్టింట్లో ఇదే చర్చ..!

బాలినేని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతున్నాయి. అన్నీ సరే కానీ.. మాజీ మంత్రి ఈ కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి చేశారు..? ఆయన కారుకు అనుమతి ఇవ్వనిది పోలీసులు.. వాళ్లను ఉద్దేశించి చేశారా..? లేకుంటే సీఎం జగన్‌నే (CM Jagan) డైరెక్ట్ ఇలా అటాక్ చేశారా..? అని వైసీపీ కార్యకర్తలతో పాటు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు అయితే.. అబ్బా.. జగన్‌కు బాలినేనికే అది కూడా కుటుంబ సభ్యుడికే పడిందిగా..? అని ఓ రేంజ్‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ మధ్య జగన్‌కు బాలినేనికి మధ్య గ్యాప్ వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు.. కుమారుడికి టికెట్ ఇవ్వలేదని వైసీపీ పెద్దలపై మాజీ మంత్రి అసంతృప్తితో ఉన్నట్లుగా కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో సడన్‌గా బాలినేని ఈ మాటలను ఎవర్ని ఉద్ధేశించి అన్నారో ఆయనకే ఎరుక మరి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ పెద్దల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఏంటో వేచి చూడాల్సిందే.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

Jagan Balineni Interesting Scene: పాపం జగన్.. బాలినేనిని సభకు రప్పించారు సరే.. మనస్తాపానికి మందు పూయలేకపోయారే..!

*****************************

Kavitha on Sukesh : సుఖేష్‌ చంద్రశేఖర్‌‌ రిలీజ్ చేసిన వాట్సాప్ చాట్‌పై కవిత రియాక్షన్ ఇదీ.. మీడియాకే ఛాలెంజ్ చేస్తూ..

*****************************

Kavitha Vs Sukesh : కవిత సంచలన ప్రకటనపై సుకేష్ లాయర్ స్ట్రాంగ్ రియాక్షన్.. ఇంత మాట అనేశారేంటి..?

*****************************

Updated Date - 2023-04-13T20:53:30+05:30 IST