Minister Kandukuri Durgesh : రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కొత్త పాలసీ
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:31 AM
రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త పాలసీ తీసుకువస్తామని పర్యాటక, సినిమాటోగ్రాఫీ శాఖా మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు.

సినీ పెద్దలతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చించారు: మంత్రి దుర్గేశ్
అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త పాలసీ తీసుకువస్తామని పర్యాటక, సినిమాటోగ్రాఫీ శాఖా మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. సినీ ప్రముఖులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధిపై గురువారం వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కందుల దుర్గేష్ సమాధానం ఇచ్చారు. విశాఖ, తిరుపతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించారన్నారు. గిరిజనుల భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.