BRS Vs Congress : బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన ఎమ్మెల్సీ పల్లా.. ఎందుకీ పైత్యం..!?

ABN , First Publish Date - 2023-08-24T22:42:48+05:30 IST

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో (Congress To BRS) చేరిన ఎమ్మెల్యేలంతా కుక్కలు..! అందుకే.. అటు నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలను దొడ్లో కట్టేశారు..! ఇవీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLC Palla Rajeshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు..

BRS Vs Congress : బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన ఎమ్మెల్సీ పల్లా.. ఎందుకీ పైత్యం..!?

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో (Congress To BRS) చేరిన ఎమ్మెల్యేలంతా కుక్కలు..! అందుకే.. అటు నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలను దొడ్లో కట్టేశారు..! ఇవీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLC Palla Rajeshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు. గురువారం నాడు షోడషపల్లిలో జరిగిన కార్యకర్తల భేటీలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చారు. ‘ బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కుక్కలు. అటువైపు ఉంటే మొరుగుతారనే BRSలో చేర్చుకొని దొడ్లో కట్టేశారు. అటువైపు ఉన్న కుక్కలను ఇటు తీసుకుని వారిని పిల్లిలాగా కేసీఆర్‌ మార్చేశారు. కేసీఆర్‌ (CMKCR) వారిని గిరిదాటకుండా చేసేశారు’ అని వ్యాఖ్యానించారు పల్లా.


congress.jpg

పల్లాకు వచ్చిన ఇబ్బందేంటో..?

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. హద్దు మీరి మరీ ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కారెక్కేశారు. వారిలో సబితా ఇంద్రారెడ్డి కూడా ఒకరు. ఆమెకు ఏకంగా విద్యాశాఖ మంత్రి పదవి కూడా కట్టబెట్టారు కేసీఆర్. అయితే.. కారు పార్టీలో చేర్చుకోవడం ఓకే.. పదవులు ఇవ్వడం కూడా ఓకే.. అంతకుమించి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కూడా కొందరికి టికెట్లు ఇచ్చింది అధిష్టానం. అంతేకాదు.. అధికార పార్టీ వాళ్లను పక్కనెట్టి మరీ.. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికే సీట్లుచ్చారు. ఆఖరికి కీలక నేతలు, బీఆర్ఎస్ ముఖ్యులు, మాజీ మంత్రులను కూడా పక్కనెట్టి మరీ కొందరికి టికెట్లు ఇచ్చారు కేసీఆర్. అయితే.. చేర్చుకున్నోళ్లు బాగానే ఉన్నారు.. చేరిన తర్వాత టికెట్లు దక్కించుకున్న వాళ్లు కూడా బాగానే ఉన్నారు కానీ.. పల్లా రాజేశ్వర్‌కు మాత్రం చాలా బాధగా.. ఇబ్బందిగా ఉన్నట్లుంది. కార్యకర్తల సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడేశారు.

Palla.jpg

ఫిర్యాదు చేస్తారా..?

పల్లా వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీరియస్‌గా ఉన్నారట. రేపో మాపో వారంతా సీఎంను కలిసి పల్లాపై ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అసలే అసంతృప్త ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తిక్కలో ఉన్న కేసీఆర్ పల్లాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏంటో అని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జనగామ అసెంబ్లీ టికెట్ విషయంలో ముత్తిరెడ్డి యాదగిరి.. పల్లా మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీంతో కేసీఆర్ కూడా ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ పెట్టాల్సిన పరిస్థితి. అయితే.. పల్లా బాగా ఓవరాక్షన్ చేస్తున్నారని ఇప్పటికే పలువురు కేసీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారట. ఇప్పుడేమో ఏకంగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై ఏ మాత్రం గౌరవం లేకుండా కుక్కలు అని.. దొడ్లో కట్టేశారని కామెంట్స్ చేయడం సిగ్గుచేటు. ఈ పరిస్థితుల్లో పల్లాపై గులాబీ బాస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

TG-Map-and-Parties.jpg


ఇవి కూడా చదవండి


KCR Cabinet : పట్నం మహేందర్ రెడ్డికి రెండు శాఖలు కేటాయించిన కేసీఆర్.. ట్విస్ట్ ఇచ్చిన కొత్త మంత్రి..!?


KCR Meets Governor : గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేక భేటీ.. 20 నిమిషాలు ఏమేం చర్చించారు..!?


TS Politics : కేసీఆర్‌కు ఊహకందని షాకివ్వబోతున్న రేవంత్ రెడ్డి.. వైఎస్ తర్వాత ఇదే రికార్డ్..!?


Mynampally Issue : మైనంపల్లిపై ఏక్షణమైనా సస్పెన్షన్ వేటు.. బీఆర్ఎస్ తరఫున మల్కాజిగిరి బరిలో విజయశాంతి..!?


Telangana Assembly polls : మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించేద్దామనుకున్న కేసీఆర్.. అనూహ్యంగా ఎంటరైన తలసాని.. ఇద్దరు మంత్రుల పోటాపోటీ..!?


Updated Date - 2023-08-24T22:47:33+05:30 IST