Share News

CBN : చంద్రబాబుతో ములాఖత్ తర్వాత సంచలన విషయాలు బయటపెట్టిన నారా లోకేష్

ABN , First Publish Date - 2023-10-28T13:07:21+05:30 IST

అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది.. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆరోగ్యం, భద్రత, బరువుపై ఇన్నిరోజులుగా పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళనే అక్షరాలా నిజమైంది. ఓ వైపు అనారోగ్యం, మరోవైపు భద్రత విషయంపై ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాస్తూ సంచలన విషయాలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే..

CBN : చంద్రబాబుతో ములాఖత్ తర్వాత సంచలన విషయాలు బయటపెట్టిన నారా లోకేష్

అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది.. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆరోగ్యం, భద్రత, బరువుపై ఇన్నిరోజులుగా పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళనే అక్షరాలా నిజమైంది. ఓ వైపు అనారోగ్యం, మరోవైపు భద్రత విషయంపై ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాస్తూ సంచలన విషయాలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే చంద్రబాబుతో.. సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రహ్మణి ములాఖత్ అయ్యారు. వీరితో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఉన్నారు. ములాఖత్ అనంతరం బాబు ఆరోగ్యం, బరువు, భద్రతకు సంబంధించి సంచలన విషయాలను మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.


Lokesh-Media.jpg

దమ్ముంటే చూపించండి..!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో దమ్ముంటే సీఐడీ, ప్రభుత్వం ఆధారాలు చూపాలి. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో ఉంచారు. బెయిల్‌పై జగన్ పదేళ్లు ఎలా బయట వున్నారు..?. బాబాయిని చంపిన ఎంపీ అవినాష్ రెడ్డి కూడా రోడ్డుపై తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబును 50 రోజులుగా జైల్లో పెట్టారు. 50 రోజులుగా స్కీల్ కేసులో ఏ చిన్న ఆధారం కూడా ప్రభుత్వం చూపించలేకపోయింది. చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసి 50 రోజులుగా జైల్లోనే ఉంచారు. ఏపీలో వ్యక్తిగత కక్ష సాధింపులు చూస్తున్నాం. చంద్రబాబు చనిపోవాలి.. చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. కేసుతో ఎలాంటి సంబంధం లేని నా తల్లి భువనేశ్వరిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీకి చెందిన మహిళా మంత్రి మాట్లాడుతున్నారు. నిజం గెలవాలి అని బస్సుయాత్రతో ప్రజల్లోకి నా తల్లి వెళ్తే ఆమెను కూడా అరెస్టు చేస్తామంటారా?. ఇది ఎంతవరకు సమంజసం. మళ్లీ మళ్లీ చెబుతున్నా చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో ఉంచి ఏం సాధించారు?. వైసీపీ అరాచకాలను వదిలేది లేదు. మళ్లీ సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే ఎక్కడ అవినీతి జరిగిందో చూపించండి. కంటి డాక్టర్ ఆపరేషన్ అవసరం అని చెబితే ఆ డాక్టర్‌పై జైలు అధికారులు ఒత్తిడి తెచ్చారు. జైలు ఆధికారులకు స్వేచ్ఛ లేదు. నాన్న ఆరోగ్యానికి సంబంధించి రెండు రిపోర్టర్లు మా దగ్గర ఉన్నాయి. ఆపరేషన్ అవసరం అని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్‌ కూడా మా దగ్గరుంది. అర్జెంట్ లేదని ఇప్పించిన రిపోర్ట్ మా దగ్గర ఉన్నాయి. ఆపరేషన్ అవసరం అని డాక్టర్ రిపోర్ట్ ఇస్తే అదే డాక్టర్‌తో.. ఆపరేషన్ అర్జెంట్ కాదని రిపోర్ట్ ఇప్పించారుఅని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

chandrababu-mulakath.jpg

అక్షరాలా నిజమే..!

అవును నిజమే.. జైల్లో డ్రోన్‌లు ఎగురుతున్నాయి. చంద్రబాబు జైల్లోకి వెళ్లేటప్పుడు ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి హోం మంత్రి సమాధానం చెప్పాలి. సజ్జల జైళ్లు శాఖ డీఐజీతో ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నారు. సీఐడీ పోలీసులు కాల్ డేటా ఎందుకు ఇవ్వరు..?. చంద్రబాబు బరువు తగ్గారు. 72 నుంచి 66 కిలోలకు బరువు తగ్గారు. నాకు చాలా బాధగా ఉంది. కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లపై ముఖుల్ రోహిత్గీతో వాయిదాలు వేయిస్తున్నారు. మేం రెడీగా ఉంటే వాయిదాలు అడుగుతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ సమాజానికి ఏం చేశాడు..? తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ విషయమై కాసాని జ్ఞానేశ్వరి హైదరాబాద్‌లో మీడియాతో చెబుతారు. వైసీపీ సామాజిక బస్సు యాత్ర ఎందుకు..?. దళితులను చంపిన వైసీపీ నేతలను జగన్ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. దళితుల పథకాలను జగన్ రద్దు చేశారుఅని జగన్ సర్కారుపై లోకేష్ కన్నెర్రజేశారు. మొత్తానికి చూస్తే.. గత కొన్నిరోజులుగా టీడీపీ శ్రేణుల్లో నెలకొన్న ఆందోళనకు ఇవాళ్టితో తెరపడింది. ఓ వైపు చంద్రబాబు రాసిన లేఖ విషయంలో.. కుటుంబ సభ్యులు చెబుతున్న మాటలను కోర్టులు, ప్రభుత్వం ఎలా పరిగణనలోనికి తీసుకుని బాబుకు భద్రత కల్పిస్తుందో చూడాలి మరి.

cbn-jail-(2).gif

Updated Date - 2023-10-28T13:49:33+05:30 IST