AP Governor : ఏపీ గవర్నర్‌ బిశ్వభూష‌ణ్‌ను ఇంత సడన్‌గా ఎందుకు తొలగించారు.. కారణాలేంటి..!?

ABN , First Publish Date - 2023-02-12T15:48:17+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గవర్నర్‌ బిశ్వభూషణన్ హరిచందన్‌ను (Biswabhusan Harichandan) సడన్‌గా కేంద్రం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను (Abdul Nazeer) ఏపీకి నియమించింది..

AP Governor : ఏపీ గవర్నర్‌ బిశ్వభూష‌ణ్‌ను ఇంత సడన్‌గా ఎందుకు తొలగించారు.. కారణాలేంటి..!?

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గవర్నర్‌ బిశ్వభూషణన్ హరిచందన్‌ను (Biswabhusan Harichandan) సడన్‌గా కేంద్రం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను (Abdul Nazeer) ఏపీకి నియమించింది. ఈయనకు పెద్ద చరిత్రే ఉంది. ఒక్క ఏపీలోనే కాదు.. మరో 12 రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. మిగతా రాష్ట్రాల గురించి ఎక్కడా పెద్దగా చర్చ నడవట్లేదు కానీ.. ఉన్నట్టుండి ఏపీ గవర్నర్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ బిశ్వభూష‌ణ్‌ను ఎందుకు తొలగించారు..? ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి ఎందుకు పంపాల్సి వచ్చింది..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Gov-Single.jpg

సడన్‌గా ఎందుకీ మార్పు..?

ఉన్నట్టుండి గవర్నర్ మార్పు అనేది ఏపీ ప్రభుత్వానికి ఊహించని పెద్ద షాకే అని చెప్పుకోవచ్చు. బీజేపీ కాకుండా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండే రాష్ట్రాల్లో గవర్నర్లకు- ప్రభుత్వాలకు మధ్య నిత్యం వివాదాలు నడిచేవి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు గవర్నర్ల వ్యవహారం ఎంతవరకూ వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో అయితే అందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితి ఉండేది. హరిచందన్.. బీజేపీతో అనుబంధం ఉన్న నాయకుడు అయినప్పటికీ.. సీఎం జగన్‌తో (CM Jagan) ఎక్కడా ఎలాంటి విబేధాలు లేకుండా మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా వీరిద్దరి మధ్య ఎక్కడా పొరపచ్చాలు వచ్చిన సందర్భాలు లేవు. అయితే.. ప్రతి విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుండేవారు. అందుకే ఈయన్ని ఏపీ గవర్నర్‌గా తొలగించిన కేంద్రం.. ఛత్తీస్‌గఢ్‌కు పంపిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇలా ఒకట్రెండు కాదు.. చిత్ర విచిత్రాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Jagan-and-Gov.jpg

ఇదిలా ఉంటే.. ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. వచ్చే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని రీతిలో గవర్నర్‌ను మార్చడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఈ మార్పు వెనుక ఏదైనా రాజకీయ కోణం కూడా ఉండొచ్చని నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. కొత్తగా వచ్చే గవర్నర్‌ ఎలా ఉంటారు..? ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటారా..? లేకుంటే తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జరిగినట్లు ఇక్కడ కూడా పరిస్థితులు ఉంటాయా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు మరి. కొత్త గవర్నర్ విషయంలో ఏపీ ప్రభుత్వంలో కూడా కాస్త ఆందోళన మొదలైందని తెలుస్తోంది.

Jagan-and-Gov-2.jpg

ఎవరీ కొత్త గవర్నర్..?

ఏపీకి కొత్త గవర్నర్‌గా అబ్దుల్ నజీర్‌ను నియమించిన తర్వాత.. ఆయన ఎవరు..? ఇదివరకు ఎక్కడ పనిచేశారు..? బీజేపీతో ఆయనకున్న సంబంధాలేంటి..? గూగుల్‌లో జనాలు సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈయన మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నివాసి. 1983లో న్యాయ‌వాదిగా క‌ర్నాట‌క హైకోర్టులో ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన ఈయన.. 2003లో క‌ర్నాట‌క హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. ఆ తర్వాత అదే హైకోర్టు న్యాయ‌మూర్తిగా కూడా బాధ్యత‌లు చేపట్టారు. 2017లో కర్ణాటక హైకోర్టు నుంచి డైరెక్టుగా.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌దోన్నతి పొందారు. అయోధ్యపై (Ayodhya Case) సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పిన ఐదుగురు ఉన్న బెంచ్‌లో నజీర్ కూడా ఒకరు. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ (Triple Talaq) కేసును విచారించిన వారిలో నజీర్ ఏకైక ముస్లీం న్యాయమూర్తి. ఈ ఏడాది జ‌న‌వ‌రి 4న న‌జీర్ ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. అయితే న్యాయ వ్యవస్థలో ఈయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇలా గవర్నర్‌గా నియమించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం.. ప్రభుత్వం చెప్పినట్లుగా వినడం వల్లే ప్రధాని ఆశీస్సులతో ఇలా గవర్నర్‌ అయ్యారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.

News.jpg

ఎవర్ని ఎక్కడికి మార్చారు.. కొత్త వారెవరు..!?

1. ఆంధ్రప్రదేశ్ : సుప్రీంకోర్టు మాజీ జడ్జి సయ్యద్ అబ్దుల్ నజీర్

2. ఛత్తీస్‌గఢ్ : బిశ్వభూషణ్ హరిచందన్

3. మహారాష్ట్ర : రమేష్

4. సిక్కిం : లక్ష్మణ్‌ప్రసాద్

5. అరుణాచల్‌ప్రదేశ్ : త్రివిక్రమ్ పర్నాయక్

6. జార్ఖండ్: రాధాకృష్ణన్

7. అస్సాం : గులాబ్‌చంద్ కటారియా

8. హిమాచల్‌ప్రదేశ్ : శివప్రసాద్ శుక్లా

9. మణిపూర్ : అనసూయ

10. లడఖ్ : బీడీ మిశ్రా

11. నాగాలండ్ : గణేషన్

12. మేఘాలయ : చౌహాన్

13. బిహార్ : రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.

*************************

ఇవి కూడా చదవండి..

AP Capitals : ఏపీ రాజధానిపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు.. ఈ కామెంట్స్‌తో..

*************************

Lokesh Yuvagalam : నాన్నను చూడాలని బ్రాహ్మణిని అడిగిన దేవాన్ష్.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా...!

*************************
YS Jagan : లెక్కలు తీసి మరీ పరువు తీసిన కేంద్రం.. సిగ్గో.. సిగ్గు మూడున్నరేళ్లలో సీఎం జగన్ కట్టిన ఇళ్లు ఎన్నో తెలిస్తే షాకే..!

*************************

Updated Date - 2023-02-12T16:16:16+05:30 IST