Allu Aravind: దిల్ రాజు, పరశురామ్ ల మీద సీరియస్ ?

ABN , First Publish Date - 2023-02-06T14:13:51+05:30 IST

ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈరోజు అంటే సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఒక ముఖ్యమయిన విషయం గురించి అల్లు అరవింద్ ఈ మీడియా సమావేశం లో మాట్లాడతారు అని అంటున్నారు. అయితే ఇంతకీ ఏమి మాట్లాడతారు అనే విషయం మీద అనేక రకాలుగా చర్చలు నడుస్తున్నాయి

Allu Aravind: దిల్ రాజు, పరశురామ్ ల మీద సీరియస్ ?

ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈరోజు అంటే సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఒక ముఖ్యమయిన విషయం గురించి అల్లు అరవింద్ ఈ మీడియా సమావేశం లో మాట్లాడతారు అని అంటున్నారు. అయితే ఇంతకీ ఏమి మాట్లాడతారు అనే విషయం మీద అనేక రకాలుగా చర్చలు నడుస్తున్నాయి పరిశ్రమలో. అల్లు అరవింద్ కి దగ్గరిగా వుండే వాళ్ళ ప్రకారం ఈ మీడియా సమావేశం కొంచెం ఘాటుగా వుండే అవకాశం వుంది అని చెప్తున్నారు.

allu-aravind2.jpg

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే నిన్న ఆదివారం నాడు నిర్మాత దిల్ రాజు (Dil Raju), దర్శకుడు పరశురామ్ (Director Parasuram), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుందని ప్రకటించారు. ఇది కూడా సాంఘీక మాధ్యమాల వేదికగా చెప్పారు. పరశురామ్, విజయ్ మళ్ళీ ఇంకో సినిమా కోసం కలుస్తున్నారు అని, ఈసారి నిర్మాత దిల్ రాజు కోసం అని వార్తలు కూడా వెలువడ్డాయి. వీళ్ళిద్దరూ ఇంతకు ముందు 'గీత గోవిందం' (#GeethaGovindam) అనే సూపర్ హిట్ సినిమా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నారు. ఇంతవరకు బాగానే వుంది, కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది.

allu-aravind3.jpg

దర్శకుడు పరశురామ్, మహేష్ బాబు (Mahesh Babu) సినిమా 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) తరువాత గీత ఆర్ట్స్ (Geetha Arts) కి ఒక సినిమా చెయ్యాల్సి వుంది. ఎందుకంటే అల్లు అరవింద్ 'గీత గోవిందం' షూటింగ్ జరుగుతూ ఉండగానే పరశురామ్ కి అడ్వాన్స్ ఇచ్చారు అని తెలిసింది. 'సర్కారు వారి పాట' చేసాక గీత ఆర్ట్స్ కి చేస్తాను అని పరశురామ్ ఒప్పుకున్నాడు అని ఒక వార్త నడుస్తోంది. అయితే ఇప్పుడు సడెన్ గా పరశురామ్, నిర్మాత దిల్ రాజుకి సినిమా చేస్తా అనటం అల్లు అరవింద్ కి నచ్చలేదు. అందుకని ఈ విషయం మీద గట్టిగా మాట్లాడటానికి ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ సమావేశం లో పరశురామ్ మీద, దిల్ రాజు మీద అల్లు అరవింద్ గట్టిగా బాణాలు సంధిచే అవకాశం వుంది అని అంటున్నారు. మరి కొద్దీ గంటల్లో ఏ విషయం అనేది ఎలాగు తెలుస్తుంది, ఆ అప్డేట్ కోసం కూడా ఇక్కడ చూడండి.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-06T17:42:01+05:30 IST