Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. ఇలాంటి డైట్‌‌లను మాత్రం ఫాలో కాకండి.. వీటి వల్లే జరిగే అనర్థాలు ఏంటంటే..

ABN , First Publish Date - 2023-09-10T10:56:08+05:30 IST

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు కారణంగా మధుమేహం, రక్తపోటు వంటి అనేక ఇతర సమస్యలు చుట్టుముడుతుంటాయి. బిజీ బిజీ లైఫ్ వల్ల చాలా మంది తమ కోసం సమయం కేటాయించుకోలేరు. వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. ఒకవేళ చేసినా త్వరితగతిన ఫలితం కనబడదు.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. ఇలాంటి డైట్‌‌లను మాత్రం ఫాలో కాకండి.. వీటి వల్లే జరిగే అనర్థాలు ఏంటంటే..

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు (Over Weight). ఈ అధిక బరువు కారణంగా మధుమేహం (Diabetes), రక్తపోటు (Blood Pressure) వంటి అనేక ఇతర సమస్యలు చుట్టుముడుతుంటాయి. బిజీ బిజీ లైఫ్ వల్ల చాలా మంది తమ కోసం సమయం కేటాయించుకోలేరు. వ్యాయామం (Exercise) చేయడానికి సమయం ఉండదు. ఒకవేళ చేసినా త్వరితగతిన ఫలితం కనబడదు. దీంతో షార్ట్‌కట్‌లు ఆలోచించి రకరకాల డైట్‌లను (Diet Plans) ఫాలో అయి ఆరోగ్యాన్ని మరింత నాశనం చేసుకుంటారు. బరువు తగ్గిస్తాయనే భ్రమలో ఫాలో అయ్యే కొన్ని డైట్‌లు తీవ్ర దుష్పరిణామాలు కలిగిస్తాయి.

బరువు తగ్గించే (Weight Loss) డైట్ అనగానే అందరూ ముందుగా చెప్పేది కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు తగ్గించాలని. లో-కార్బ్ డైట్ (Low carb diets) అనేది బాగా ప్రాచుర్యం పొందింది. కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే దీని వల్ల చాలా సైడ్-ఎఫెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలోని కండరాలు, కిడ్నీలపై ప్రభావం పడుతుంది. ఇక, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంచే డైట్‌ల వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఇక, అధికంగా ప్రొటీన్ తీసుకునే డైట్ కూడా ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఈ ప్రొటీన్ డైట్ అందరికీ ఒకేలా అప్లయ్ అవదు. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి వారి ప్రొటీన్ అవసరాలు ఉంటాయి. అవేవీ తెలుసుకోకుండా గుడ్డిగా దీనిని ఫాలో అయితే కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయి (Food and Health).

Wife: ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిందో భార్య.. భర్త కొడుతున్నాడంటూనే.. ఆమె చెప్పిన కారణం విని అవాక్కైన పోలీసులు..!

ఇక, రోజులో కేవలం మాంసం, వెన్న, నీరు మాత్రమే తీసుకునే లయన్ డైట్‌ (Lion Diet)ను కూడా కొందరు ఫాలో అవుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకర డైట్. ఈ డైట్‌ను పాటిస్తే చాలా త్వరగా బరువు తగ్గుతారు. కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే కేవలం మాంసం మాత్రమే తిని దానిని జీర్ణించుకోవడం అంత సులభం కాదు. పైగా దీనిని ఎక్కువ కాలం కొనసాగించలేము. దీంతో బరువు తిరిగి రావడమే కాకుండా, అప్పటికే శరీరానికి కొంత నష్టం కూడా వాటిల్లుతుంది. నిజానికి నెలకు రెండు కేజీలకు మించి బరువు తగ్గడం అనర్థదాయకం. ఆ మేరకు మాత్రమే బరువు తగ్గాలని నిర్ణయించకుంటే చాలా సులభమైన డైట్, వ్యాయామం చేస్తే సరిపోతుంది.

Updated Date - 2023-09-10T10:56:08+05:30 IST