Eggs: కోడిగుడ్డు పెంకు రంగుల్లో ఎందుకింత తేడా..? ఒక్కొక్కటీ ఒక్కో రంగులో ఎందుకు ఉంటాయంటే..!
ABN , First Publish Date - 2023-11-10T14:33:33+05:30 IST
కోడిగుడ్ల పెంకులు వేరు వేరు రంగులలో ఉండటానికి అసలు కారణం ఇదే..
కోడిగుడ్లు ప్రజల ఆహారంలో చాలా సాధారణమైపోయాయి. అయితే కోడిగుడ్లు తెల్లగానూ, గోధుమ రంగులోనూ, ముదురు గోధుమ రంగులోనూ ఉంటాయి. అంతగా గమనించరు కానీ ఈ గుడ్ల లోపల పచ్చ సొన కూడా రంగు విషయంలో తేడాగానే ఉంటుంది. అసలు కోడి గుడ్డు పెంకులు ఇలా వేరు వేరు రంగుల్లో ఎందుకుంటుంది? దీని వెనుక అసలు కారణాలేంటి? తెలుసుకుంటే..
కోడిగుడ్లు పోషకాహారం జాబితాలోకి వస్తాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకపోవడమే కాకుండా జబ్బులు సోకినప్పుడు వేగంగా కోలుకుంటారు కూడా. అయితే కోడిగుడ్లు వివిధ రంగులో ఉంటాయి. ముఖ్యంగా కోడిగుడ్డు పెంకులు తెల్లగానూ, గోధుమ రంగులోనూ, ముదురు గోధుమ రంగులోనూ ఉంటాయి(Egg shell color reason). వీటివెనుక కోడి జాతి నుండి వివిధ రకాల కారణాలున్నాయి.
ఇదికూడా చదవండి: Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం అద్భుతం.. కింద పడి ఉన్న ఈ ఆకును కర్రపుల్లతో కదపగానే.. షాకింగ్ సీన్..!
కోడి రంగు, జాతి..
వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ కోడి రంగు, జాతిని బట్టి కోడిగుడ్డు పెంకు రంగు మారుతుంది. తెల్లని ఈకలు(White feathers) కలిగిన కోళ్లు తెల్లని పెంకు కలిగిన గుడ్లు పెడతాయి. అలాగే ఎర్రటి ఈకలు(Red feathers) ఉన్న కోళ్లు గోధుమ రంగు పెంకు కలిగిన గుడ్లు పెడతాయి. ఇలా కోడి రంగును బట్టి గుడ్డు పెంకు రంగు కూడా మారుతుంది.
గోధుమ రంగు గుడ్లు..(brown shell eggs)
చాలావరకు మార్కెట్ లో గోధుమ రంగు గుడ్ల ధర తెల్లని పెంకు కలిగిన గుడ్లతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి కారణం ఈ గుడ్లు ఎర్రటి ఈకలున్న కోళ్లు పెట్టినవి కావడమే. ఈ జాతి కోళ్లు చాలా పెద్దవి. వీటి పెంపకానికి చాలా ఖర్చు అవుతుంది. వీటిని నాటు కోళ్లని కూడా అంటారు. పైపెచ్చు కోళ్లు ఎంత పోషకాహారం తింటే కోడి గుడ్డులోనూ అంత పోషకాలు ఉంటాయట. కాబట్టి వీటి ఆహారానికి ఖర్చు ఎక్కువ అందువల్ల వీటి గుడ్ల ఖరీదు కూడా ఎక్కువ.