Viral Video: ఆకలితో ఉన్న పులిని కెలికారు.. చివరకు వాహనం మీదకు ఎలా వచ్చిందో చూడండి..

ABN , First Publish Date - 2023-04-27T16:17:30+05:30 IST

బోనులో ఉన్న పులులు, సింహాలతో కొందరు చెలగాటం ఆడాలని చూస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు చేతులు, మరికొందరు కాళ్లు పోగొట్టుకున్న సందర్భాలు చాలా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన..

Viral Video: ఆకలితో ఉన్న పులిని కెలికారు.. చివరకు వాహనం మీదకు ఎలా వచ్చిందో చూడండి..

బోనులో ఉన్న పులులు, సింహాలతో కొందరు చెలగాటం ఆడాలని చూస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు చేతులు, మరికొందరు కాళ్లు పోగొట్టుకున్న సందర్భాలు చాలా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ పులికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆకలితో ఉన్న పులిని పర్యాటకులు వీడియోలు, ఫొటోలు తీస్తూ ఇబ్బంది పెడతారు. దీంతో పులికి కోపం కట్టలు తెంచుకుంటుంది. చివరకు వాహనం మీదకు దాడి చేయాలని చూస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.

ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు పర్యాటకులు (Tourists) వివిధ వాహనాల్లో పార్కులోకి వెళ్లారు. లోపల వివిధ రకాల జంతువులను చూస్తూ తమ కెమెరాల్లో (Cameras) బంధిస్తున్నారు. ఈ క్రమంలో వారికి దారి పక్కనే పొదల్లో ఓ పెద్ద పులి (tiger) కనిపిస్తుంది. వెంటనే వాహనం ఆపి అంతా పులిని ఫొటోలు, వీడియోలు (Photos and videos) తీసుకోవడం మొదలెడతారు. సాధారణంగా క్రూరమృగాలు పర్యాటకుల వాహనాలపై (Tourist vehicles) దాడి చేయవు. అయితే కొన్నిసార్లు అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. ఇక్కడ కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Viral Vdeo: ఇతడు చపాతీ పిండితో చేసిన విన్యాసం చూస్తే ఖంగుతినడం ఖాయం.. వీడియో చూస్తేగానీ నమ్మలేరు..

అప్పటికే ఆకలితో ఉన్న ఈ పులి.. వీరిని చూడగానే ఒక్కసారిగా మరింత ఆగ్రహానికి గురవుతుంది. బిగ్గరగా గాండ్రిస్తూ వాహనం మీదకు దాడి చేసేందుకు (Tiger attack on Tourists vehicle) పరుగు పరుగున వస్తుంది. దీంతో డ్రైవర్ భయంతో.. వాహనాన్ని వెనక్కు మళ్లిస్తాడు. అయినా కొంత దూరం వాహనాన్ని వెంబడించిన పులి.. ‘‘ఇంకోసారి కెలికారో మామూలుగా ఉండదు’’ అన్నట్లుగా వార్నింగ్ ఇస్తూ వెనక్కు వెళ్తుంది. తర్వాత మరో వాహనంలో ఉన్న వారు అదిలించడంతో అక్కడి నుంచి పొదల్లోకి పారిపోతుంది. ప్రమాదం తప్పడంతో పర్యాటకులంతా హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral News: ఈ వ్యభిచారాన్ని వదిలెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా.. హోటల్‌లో కలిసిన 20 ఏళ్ల వేశ్యకు ఓ కుర్రాడి ఆఫర్.. చివరకు..!

Updated Date - 2023-04-28T21:04:10+05:30 IST

News Hub