Viral Video: క్షణాల్లో కుప్పకూలిన బ్రిడ్జ్.. చప్పట్లు కొట్టిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-05-09T14:31:08+05:30 IST
జర్మనీలోని లూడెన్షిడ్ ప్రాంతంలో ఉన్న ఓ పురాతన బ్రిడ్జ్‌ను అధికారులు కూల్చేశారు. 1965, 1968 మధ్య కాలంలో నిర్మించిన ఈ వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి.
జర్మనీలోని (Germany) లూడెన్షిడ్ ప్రాంతంలో ఉన్న ఓ పురాతన బ్రిడ్జ్‌ను (Bridge) అధికారులు కూల్చేశారు. 1965, 1968 మధ్య కాలంలో నిర్మించిన ఈ వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీనిపై ప్రయాణాలకు అనుమతిస్తే భారీ ప్రాణ నష్టం తప్పదని భావించిన అధికారులు 2021లో డిసెంబర్‌లో మూసేశారు. అప్పట్నుంచి ఈ 450 మీటర్ల బ్రిడ్జ్‌పై ఎవరూ ప్రయాణించడం లేదు. తాజాగా ఆ బ్రిడ్జ్‌ను పేలుడు పదార్థాలు అమర్చి నేలమట్టం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
లూడెన్షిడ్ ప్రాంతంలో ఉన్న రాహ్మెడటాల్ బ్రిడ్జ్‌ను ఆదివారం కూల్చేశారు (Germany demolishes Rahmedetal Bridge). దాని వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆరు నెలల నుంచి ఆ బ్రిడ్జ్ కూల్చివేతకు ప్రణాళికలు రచిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాలకు ఎటువంటి నష్టమూ కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని కూల్చివేత కార్యక్రమం పూర్తి చేశారు. అంత పెద్ద బ్రిడ్జ్ సెకెన్ల వ్యవధిలో మాయమైపోయింది. ఆ కూల్చివేత సమయంలో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు.
Viral: సీన్ రివర్స్.. పెళ్లి పీటలపై వరుడికి షాకిచ్చిన వధువు.. ఆమె చెప్పింది విని నిర్ఘాంతపోయిన బంధువులు.. అసలు కథేంటంటే..
బ్రిడ్జి కూలిపోయిన తర్వాత అందరూ చప్పట్లో అభినందించారు. ఆ ప్రాంతంలో ఓ కొత్త బ్రిడ్జ్‌ను నిర్మించబోతున్నారు. ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు ఐదేళ్ల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. కాగా, ఆ బ్రిడ్జ్ కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.