Viral Video: ఎలాన్ మస్క్‌కు పూజలు.. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు..!
ABN , First Publish Date - 2023-02-28T14:04:04+05:30 IST
ట్విటర్‌ను చేజిక్కించుకున్నాక టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) సంస్థలో పలు కీలక మార్పులు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్‌ను చేజిక్కించుకున్నాక టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) సంస్థలో పలు కీలక మార్పులు చేశారు. భారీ మొత్తంలో ఉద్యోగాలకు కోత పెట్టారు. ఆయన చేపట్టిన తొలగింపుల పర్వం(Layoffs) కార్పొరేట్ ప్రపంచంలో కలకలం రేపింది. ఏకంగా సంస్థలో 50 శాతం సిబ్బంది ఉద్యోగం కోల్పోయారని ఓ అంచనా. దాంతో సంస్థ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక తొలగింపునకు గురైన ఉద్యోగులు మస్క్‌పై తీవ్ర స్థాయిలోనే పెదవి విరిచారు. అయితే, తాజాగా కొందరు ఆయనకు 'మా దేవుడు నీవేనయ్యా.. మా కోసం పుట్టావయ్యా' అనే రేంజ్‌లో పూజలు చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వీడియో ఎక్కడిది? ఆయనకు పూజలు చేసే వారు ఎవరు? వారు అలా ఎందుకు చేశారు? తదితర వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలాన్ మస్క్‌ను దేవుడిని చేసిని పూజలు చేసింది ఎవరో కాదు. బెంగళూరుకు చెందిన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ (Save Indian Family Federation) అనే సంస్థ. కొన్నాళ్ల పురుషుల బాధల్ని చెప్పుకునేందుకు సామాజిక వేదిక ట్విట్టర్లో అవకాశం కల్పించారంటూ ఆ సంస్థల ప్రతినిథులు ఇలా ఆయనకు పూజలు చేశారు. బెంగళూరులోని ఫ్రీడం పార్కులో మస్క్ ఫొటోకు ఇలా ప్రత్యేక పూజలు చేశారు. అంతటితో ఆగకుండా ‘వోకాషురాను నాశనం చేసేవాడు’ అంటూ ప్రశంసించారు. అంతేనా.. మస్క్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో 'మెన్స్ లైవ్స్ మ్యాటర్' (Men’s Lives Matter) అనే ట్యాగ్‌లైన్ కూడా వేశారు.
ఇది కూడా చదవండి: గతేడాది రూ.25 కోట్ల లాటరీ గెలిచిన ఈ ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..
ఈ నేపథ్యంలో ఫ్రీడం పార్కులో చిన్నపాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 'సేవ్ ఇండియన్ ఫ్యామిలీ' సంస్థకు చాలా మంది పురుషులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్క్ చిత్రానికి హారతులు ఇచ్చి, మగవారి హక్కుల్ని కాపాడేవారంటూ చిత్రంగా మంత్రోచ్చరణలతో పూజలు చేశారు. ఈ తతాంగాన్నంతటిని ఆ కార్యక్రమానికి హాజరైన చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత వీడియోను నెట్టింట్ పెట్టారు. దాంతో ‘ఎలోన్ కస్తూరి పూజ’ పేరిట వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదిలాఉంటే.. గత కొన్ని రోజులుగా 'సేవ్ ఇండియన్ ఫ్యామిలీ' సంస్థ సభ్యులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వైవాహిక అత్యాచారంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకి వ్యతిరేకంగా బెంగళూరులోని స్వాతంత్ర్య ఉద్యానవనంలో నిరసనలు చేస్తున్నారు. అత్యాచారం, గృహహింస, వరకట్నం చట్టాలు ఇప్పటికే పురుషులపై కక్షపూరితంగా ఉన్నాయని, దీంతో తప్పుడు కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం అసలు బాధితులకు న్యాయం చేయడానికి బదులు దుర్వినియోగానికి ఉపయోగపడుతుందని వారు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మిరాకిల్ అంటే ఇదేనేమో.. టర్కీలో 21 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన మూగజీవి..!