Hair Health: తలదువ్విన ప్రతీసారి ఇంతింత జుట్టు రాలుతోందా..? కొబ్బరి నూనెనే వాడండి కానీ..!
ABN , First Publish Date - 2023-10-31T12:28:22+05:30 IST
సాధారణ కొబ్బరినూనెను ఇలా వాడితే.. దారుణమైన హెయిర్ పాల్ కూడా దెబ్బకు సెట్ అయిపోతుంది.
జుట్టు రాలే సమస్య ఇప్పట్లో చాలా ఎక్కువగా ఉంది. చిన్నవయసులోనే జుట్టు బాగా రాలిపోవడం వల్ల జుట్టు పలుచబడటం, సన్నగా, ఎలుకతోకలా మారిపోవడం జరుగుతుంది. మగవారిలో అయితే బట్టతల తొందరగా వస్తుంది. ఈ జుట్టు రాలే సమస్యను అధిగమించడానికి చాలామంది మార్కెట్లో దొరికే షాంపూలు, నూనెలు ఉపయోగిస్తుంటారు. మరికొందరు కనిపించిన ప్రతి చిట్కా ఫాలో అవుతుంటారు. అయితే జుట్టు రాలే సమస్యకు(Hair fall problem) సాధారణమైన కొబ్బరినూనెతోనే చెక్ పెట్టవచ్చు. అందుకోసం కొబ్బరినూనెను ఈ కింది విధంగా వాడాలి.
కొబ్బరినూనె(Coconut) జుట్టు సంరక్షణలో ఎక్కువగా వినియోగించే నూనె. ఏ ఇతర పదార్థాలు కలపకుండా సాధారణమైన నూనెను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోవడాన్ని కూడా ఆపవచ్చు. ఇందుకోసం స్వచ్చమైన కొబ్బరినూనె అవసరం. జుట్టు పరిమాణాన్ని బట్టి ఒక కప్పులో కొబ్బరి నూనె తీసుకోవాలి. దీన్ని డబుల్ బాయిల్(గిన్నెలో నీరు వేడి చేసి ఆ నీటిలో కొబ్బరినూనె ఉన్న కప్పు ఉంచాలి. ఇలా నూనె వేడి అవుతుంది) చేయాలి. ఈ గోరు వెచ్చని నూనెను తలకు పెట్టుకోవాలి.
Health Facts: కళ్లజోడు వాడుతున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమిది.. రోజూ 10 నిమిషాలు ఇలా చేస్తే..!
జుట్టుకునూనె పెట్టుకునే ముందు జుట్టును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. అలాగే తలలో తేమ, చెమట లాంటివి లేకుండా జాగ్రత్త పడాలి. పొడిగా ఉన్న జుట్టుకు మాత్రమే నూనె పెట్టుకోవాలి.
గోరువెచ్చని కొబ్బరినూనెను మునివేళ్లతో అద్దుకుంటూ సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. జుట్టు కుదుళ్లు, మాడుకు పట్టేలాగా వృత్తాకారంగా వేళ్ళను కదిలిస్తూ మసాజ్ చేసుకోవాలి. తలకు నూనె పట్టించిన తరువాత జుట్టు పొడవునా నూనెను అప్లై చేయాలి. ఆ తరువాత అరగంట సేపు ఆగి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా చేస్తుంటే జుట్టురాలడమనే సమస్య అస్సలు ఎదురే కాదు. రాత్రి సమయంలో నూనె అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది.