ప్రేమ విషయంలో తల్లిదండ్రులు మందలించారని ఓ అమ్మాయి చేసిన నిర్వాకం.. చీకట్లో ఒంటరిగా అబ్బాయి ఇంటికెళ్ళి..
ABN , First Publish Date - 2023-03-15T16:18:48+05:30 IST
తల్లిదండ్రులు మందలించారని అర్థరాత్రి ఇంట్లోంచి బయటపడి చివరికి..
ఈకాలం పిల్లలకు ముందుచూపు తక్కువ. తల్లిదండ్రులు ఏదైనా వద్దని చెప్పాక వారు ఎందుకు చెప్పారు అనే విషయాన్ని ఆలోచించరు. తల్లిదండ్రులతో ఏదీ వివరంగా మాట్లాడకుండానే పిచ్చి పనులు చేస్తుంటారు. రెండు పదుల వయసు దాటిన ఓ అమ్మాయి అలాగే చేసింది. 'అతడితో ప్రేమ ఏంటి? ఇవన్నీ కట్టిపెట్టి బుద్దిగా చదువుకో.. లేకపోతే పెళ్ళిచేసి పంపేస్తాం' అని తల్లిదండ్రులు మందలించారు. దాంతో ఆ అమ్మాయి అర్థరాత్రి ఇంట్లోంచి బయటపడి నేరుగా తను ప్రేమించిన కుర్రాడి ఇంటికెళ్ళింది. అక్కడ ఆమె చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం హర్దోయ్(Hardoi) జిల్లాలో బెహతా గోకుల్ పోలిస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 20ఏళ్ళ అమ్మాయి, అదే ప్రాంతానికి చెందిన 22ఏళ్ళ అబ్బాయి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో అమ్మాయి తల్లిదండ్రులు 'బుద్దిగా చదువుకోకుండా ఏంటి నువ్వు చేస్తున్నది? ఇలాగే చేశావంటే పెళ్ళి చేసి పంపిస్తాం' అని మందలించారు. తల్లిదండ్రుల మాటలు అమ్మాయికి కోపం తెప్పించాయి. అదే రోజు రాత్రి అందరూ నిద్రపోయాక ఇంటి నుండి బయటపడింది. నేరుగా ప్రేమించిన అబ్బాయి ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో అబ్బాయి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎవరూ ఏమీ అనేవారు లేరు వారిని. అమ్మాయి తన మొబైల్ లో వీడియో ఆన్ చేసి 'ఇదిగో ఇది నేను ప్రేమించిన అబ్బాయి ఇల్లు, ఈ సమయంలో ఈ సమయంలో ఒంటరిగా నేను ఇక్కడికి వచ్చాను, ఇతన్నే పెళ్ళి చేసుకుంటాను'. అంటూ వీడియో తీసింది. ఈ అమ్మాయి చేసిన అక్కడ అందరికీ తెలియడంతోపాటు, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కూతురు ఇంట్లో కనిపించడం లేదేంటని వెతుకుతున్న తల్లిదండ్రులకు వైరల్ అవుతున్న వీడియో కనిపించింది. దాంతో పాటు చాలా మంది అమ్మాయి గురించి మాట్లాడుతూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో తల్లిదండ్రులు ఫోన్ ఆఫ్ చేసుకున్నారు. అమ్మాయికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు తమకు రాలేదని. ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రాంత పోలీసులు తెలిపారు. కాగా అబ్బాయి విషయంలో తనను వేధించడం, బెదిరించడం చేస్తే ఉరివేసుకుని చచ్చిపోతానంటూ అమ్మాయి వీడియోలో బెదిరించింది. అందుకే తల్లిదండ్రులు ఏమీ అనడం లేదని స్థానికులు చెబుతున్నారు.