Sir: హైపర్ ఆది ఎందుకంత ఫేమసో నాకు తెలీదు: ధనుష్

ABN , First Publish Date - 2023-02-16T11:51:34+05:30 IST

సినిమాకి పనిచేసిన వారి ఒక్కొక్కరి గురించి ధనుష్ మాట్లాడుతూ హైపర్ ఆది (Hyper Adi) గురించి చెప్పవలసి వచ్చినప్పుడు 'నిజంగా నాకు మీరు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారో తెలియదు. ఇంతకు ముందు కూడా నేను మీరు చెప్పినప్పుడు క్లాప్స్, విజిల్స్ బాగా వేశారు. ఎందుకు మీరు అంత ఫేమస్ అయ్యారో నాకు తెలియదు', అని చెప్పాడు (#Sir/Vaathi) ధనుష్.

Sir: హైపర్ ఆది ఎందుకంత ఫేమసో నాకు తెలీదు: ధనుష్

ధనుష్ (Dhanush), సంయుక్త (Samyukta) నటించిన 'సార్' (#Sir) సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. దీనికి ముందు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో బుధవారం జరిగింది. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎడ్యుకేషన్ నేపధ్యం లో ఉంటుందని (Education backdrop) చెపుతున్నారు. ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎలా వ్యాపారాత్మకం అయిపొయింది, అందరికి ముఖ్యంగా పేదవారికి అందుబాటులోకి రావలసిన విద్య, ఇప్పుడు వ్యాపారం అయిపోయి దాన్ని ఎలా అమ్ముకుంటున్నారు, కొందరి చేతుల్లో ఉండిపోయింది అనే అంశం ఇందులో ప్రస్తావించారు.

dhanush-sir1.jpg

అయితే ఈ ఫంక్షన్ లో కథానాయకుడు ధనుష్ తెలుగులో మాట్లాడాడు చక్కగా. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అతనికి సహాయకుడిగా వుంది కొన్ని తెలుగు పదాలు మధ్య మధ్యలో అందించారు. సినిమాకి పనిచేసిన వారి ఒక్కొక్కరి గురించి ధనుష్ మాట్లాడుతూ హైపర్ ఆది (Hyper Adi) గురించి చెప్పవలసి వచ్చినప్పుడు 'నిజంగా నాకు మీరు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారో తెలియదు. ఇంతకు ముందు కూడా నేను మీరు చెప్పినప్పుడు క్లాప్స్, విజిల్స్ బాగా వేశారు. ఎందుకు మీరు అంత ఫేమస్ అయ్యారో నాకు తెలియదు', అని చెప్పాడు (#Sir/Vaathi) ధనుష్.

వెంటనే అక్కడే వున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మైక్ అందుకొని, అతను 'జబర్దస్త్' అనే ఒక కామెడీ షో లో పని చేసాడు. దానికి రచయిత, నటుడుగా అందులో మంచి పేరు తెచ్చుకొని ఆ తరువాత ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నాడు. అందుకు అతను ఫేమస్ అని చెప్పారు త్రివిక్రమ్. వెంటనే ధనుష్ నేను కూడా యూట్యూబ్ లో మీ షో చూసి విజిల్స్ వేష్ట అని చెప్పారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-16T12:01:33+05:30 IST