International Friendship Day 2023 : ఈ స్నేహితుల రోజున మీ స్నేహాన్ని ఎలా గుర్తుచేసుకుంటున్నారు..?

ABN , First Publish Date - 2023-08-06T06:22:46+05:30 IST

2011లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది.

International Friendship Day 2023 : ఈ స్నేహితుల రోజున మీ స్నేహాన్ని ఎలా గుర్తుచేసుకుంటున్నారు..?
Best Friends

స్నేహం ఓ గొప్ప అనుభూతి, అనుభవం, కాలంతో మారనిది, కలకాలం నిలిచేదిస్నేహం. ఎందరో గొప్ప స్నేహానికి నిర్వచాలుగా నిలిచిపోయారు. అలాంటి స్నేహితులకు స్నేహానికి ఒకరోజుని ఇవ్వగలిగితే అది మధురమైన కృష్ణుడు, కుచేలుల గురించి చెబుతాం. ఇలాంటి స్నేహాలు మనలోనీ ఉన్నాయని, మన స్నేహితులు ఇందుకు ఉదాహరణగా నిలుస్తారని గుర్తుచేసుకుని రోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం.

ఈరోజుకు పుట్టిన రోజు ఎపుడంటే..

ఓ ఇద్దరు స్నేహితులు 20వ శతాబ్దంలో ప్రారంభంలో హాల్ మార్క్ కార్డ్, జాయిస్ హాల్ ఇద్దరి మధ్యా వచ్చిన ఆలోచనే ఈ రోజుగా పుట్టింది. అప్పటి నుంచి ఈరోజును జరుపుకుంటున్నాం. ఇలానే మరో కథనం కూడా ఉంది. 1958లో పేరూలో తొలిసారిగా స్నేహితులు దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుంచి దీనిని కొనసాగిస్తున్నారు. ఇక 2011లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. చాలా ప్రదేశాల్లో ప్రాంతాల్లో ఈరోజును వివిధ తేదీల్లో జరుపుకుంటున్నా, పవిత్రమైన స్నేహాన్ని తలుచుకోవడం నిజంగా గొప్ప అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న ఒకే ఒక బంధం స్నేహ బంధం. పాతదైనా, కొత్తదైనా, ప్రతి స్నేహితుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ స్నేహం తెచ్చే అపారమైన విలువను జరుపుకోవడానికి, అభినందించడానికి ఇది సరైన అవకాశాన్ని ఇస్తుంది.

జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం ప్రాముఖ్యత ఏమిటి?

ఈ రోజు మన శ్రేయస్సు, ఆనందం, వ్యక్తిగత ఎదుగుదలపై మనస్నేహితులు చూపే హృదయపూర్వక ప్రభావాన్ని గుర్తుచేస్తుంది. నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే అనేది స్నేహితుల మధ్య ప్రత్యేక బంధాన్ని నిలుపుకోవడానికి ఒక అవకాశం. స్నేహితులు అంటే మనం ఎల్లప్పుడూ ఆధారపడగల వ్యక్తులు, ఏది ఏమైనా. మంచి, చెడు సమయాల్లో ఎల్లప్పుడూ మనతో ఉంటారు. స్నేహాన్ని ఇలానే తెలుపాలని, ఇలా చెబితేనే.., అలా ఉంటేనే స్నేహమనే ప్రతిపాదనలు ఏంలేవు. ప్రతి ఒక్కరికీ తమ మనసుకు నచ్చిన స్నేహితులు ఉండే ఉంటారు. అలాంటి వారిని మనస్పూర్తిగా తలుచుకుంటూ ఈరోజును సరదాగా జరుపుకుంటే చాలు. వీలైతే వాళ్ళతో..

ఇది కూడా చదవండి: వీకెండ్ వచ్చేసింది కదా అని తెగ నిద్రపోతున్నారా..? ఈ అలవాటు వల్ల జరగబోయేదేంటంటే..!


1. చక్కగా సినిమా చూడండి. ఈ స్నేహితుల రోజున మీ స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ఓ మంచి సినిమా చూసేలా ప్లాన్ చేసుకోండి.

2. మంచి ట్రిప్ ఫ్లాన్ చేయండి. ఈరోజు స్నేహితులతో కలిసి ట్రిప్ ఫ్లాన్ చేయండి.

3. ఒకరిమీద ఒకరు బహుమతుల ప్రేమను చూపించండి. ఎవరికి నచ్చిన బహుమతి వాళ్ళు తీసుకోకుండా స్నేహితుడు ఇచ్చే బహుమతిని మనసారా నవ్వుతూ తీసుకోండి.

4. సరదాగా కేక్ కట్ చేయచ్చు. మీ స్నేహానికి గుర్తుగా ఆ సంవత్సరాన్ని గుర్తుచేసుకుంటూ, మధురమైన స్నేహానికి గుర్తుగా ఓ కేక్ కట్ చేయండి.

ఇవన్నీ మన నేస్తాలకోసం, వారితో గడిపే అందమైన, మరిచిపోలేని సరదాలు,. స్నేహం అనేది మన అన్ని అవసరాల్లోకి చాలా గొప్పగా అండగా నిలిచేదిగా ఉండాలి. అలాంటి స్నేహాన్ని వెతికిపట్టుకోండి.

Updated Date - 2023-08-06T07:38:02+05:30 IST