Mamta Mohandas: నాతో రాజమౌళి చాలా పెద్ద తప్పు చేశావన్నారు
ABN , First Publish Date - 2023-02-23T15:44:55+05:30 IST
మాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో మమతా మోహన్ దాస్ (Mamta Mohandas) ఒకరు. భాషతో సంబంధం లేకుండా అనేక ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేశారు. టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘యమదొంగ’ (Yama Donga) తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు.

మాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో మమతా మోహన్ దాస్ (Mamta Mohandas) ఒకరు. భాషతో సంబంధం లేకుండా అనేక ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేశారు. టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘యమదొంగ’ (Yama Donga) తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ‘కృష్ణార్జున’, ‘కింగ్’, ‘కేడి’ తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అనేక ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు.
‘అరుంధతి’ (Arundhati) సినిమాలో హీరోయిన్ అవకాశం మొదటగా తనకే వచ్చిందని మమతా మోహన్ దాస్ తెలిపారు. కానీ, ఈ చిత్రం నుంచి కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకొన్నారు. ఆ మూవీ నుంచి తప్పుకొని చాలా పెద్ద తప్పు చేశావని టాప్ డైరెక్టర్ రాజమౌళి అనడంతోనే మమతా మోహన్ దాస్ చాలా బాధ పడ్డారట. ‘‘రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘యమదొంగ’ (Yamadonga) సినిమా కంటే ముందే నాకు మరో తెలుగు ప్రాజెక్టులో నటించే అవకాశం వచ్చింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న ‘అరుంధతి’ చిత్రం చేయమని నన్ను అడిగారు. నేను మూవీకి కూడా ఓకే చెప్పాను. కానీ, ఓ మేనేజర్ ఆ ప్రొడక్షన్ హౌస్ అంత మంచిది కాదని చెప్పారు. ఫలితంగా సినిమా నుంచి నేను తప్పుకొన్నాను. అయినప్పటికీ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి రెండు, మూడు నెలల పాటు ఆ పాత్రను చేయమని అడిగారు. కానీ, నేను ఆయన మాటలను పట్టించుకోలేదు. అనంతరం కొంత కాలానికి రాజమౌళి నాకు ఫోన్ చేశారు. ‘యమదొంగ’ ఆడిషన్‌కి రమ్మన్నారు. ఆ సమయంలో జక్కన్న ‘అరుంధతి’ సినిమాను వదులుకొని పెద్ద తప్పు చేశావన్నారు. టాప్ డైరెక్టర్ అలా అనడంతోనే నా గుండె పగిలిపోయింది’’ అని మమతా మోహన్ దాస్ చెప్పారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్
Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్
Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!