Share News

Viral Video: ఓహో.. అందుకే చలి ఇంతలా పెరుగుతోందా? అంకుల్ చేసిన పనిపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:16 PM

ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చాలా మంది చలితో వణుకుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు చలిని తట్టుకోలేకపోతున్నారు. చలికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.

Viral Video: ఓహో.. అందుకే చలి ఇంతలా పెరుగుతోందా? అంకుల్ చేసిన పనిపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..
funny video going viral

ప్రస్తుతం దేశంలో చలి (Cold) విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చాలా మంది చలితో వణుకుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు చలిని తట్టుకోలేకపోతున్నారు. చలికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో (Funny Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు. @VishalMalvi అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు (Viral Video).


సాధారణంగా ఎవరైనా ఏసీ (AC)ని లోపలి వైపు, ఫ్యాన్ ఉండే అవుటర్ యూనిట్‌ను బయట బిగించుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రివర్స్‌లో ఉంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి చలికి వణికిపోతూ చేతులను రద్దుకుంటోంది. ఆ సమయంలో కెమెరా మ్యాన్ వేరే వైపు చూపించాడు. అక్కడ కనిపిస్తున్న దుకాణంలో ఏసీ దుకాణం బయట ఉంది. ఆ ఏసీ నుంచి వస్తున్న కూలింగ్ వల్లనే చలి అంతలా పెరిగిపోతోందని ఫన్నీగా ఆ వీడియోలో చూపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను కొద్ది గంటల్లోనే 60 వేల మందికి పైగా వీక్షించారు. 12 వందల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఏయ్ అంకుల్, ఏసీ ఆఫ్ చేయండి, బాగా చలిగా ఉంది``, ``అతను లోపల ఒక అవుటర్ యూనిట్‌ను పెట్టుకుని వేడిని తీసుకుంటున్నాడేమో``, ``ఏసీని అలా ఇన్‌స్టాల్ చేయడానికి కారణమేంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: ఈ పళ్లలో నిమ్మకాయను 7 సెకెన్లలో పట్టుకుంటే.. మీ కళ్లకు సలాం కొట్టాల్సిందే..


Viral Video: ఎదుటి వారికి హాని చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో చూస్తే..


Viral Video: వామ్మో.. ఇతడు యమధర్మరాజు చుట్టంలా ఉన్నాడే.. చిచ్చు బుడ్డిని ఎలా కాలుస్తున్నాడో చూడండి..


Viral Video: వామ్మో.. టైర్ పేలితే ఎఫెక్ట్ ఇలా ఉంటుందా? ఆ వ్యక్తి గాల్లోకి ఎలా ఎగిరిపడ్డాడో చూడండి..


Viral Video: కారు ముందుకు వెళ్లకుండా చుట్టుముట్టిన ఆవులు.. ఆసలేం జరిగిందో తెలిస్తే.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 24 , 2024 | 03:16 PM