Share News

Viral Video: పల్లీలు అమ్ముకునే ఈ బాలిక ముందు గ్రాడ్యుయేట్లు కూడా దిగదుడుపే.. పాక్ బాలిక ఇంగ్లీష్ వినండి..

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:15 PM

ఇంగ్లీష్ బాగా మాట్లాడితే వారిని బాగా చదువుకున్న వారిగా పరిగణిస్తారు. ఇంగ్లీష్‌ను ఒక భాషలా కాకుండా ఎంతో గొప్పగా చూస్తారు. ఎందుకంటే బాగా చదువుకున్న వారు కూడా ఇంగ్లీష్ మాట్లాడడంలో తడబడుతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ బాలిక ఇంగ్లీష్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

Viral Video: పల్లీలు అమ్ముకునే ఈ బాలిక ముందు గ్రాడ్యుయేట్లు కూడా దిగదుడుపే.. పాక్ బాలిక ఇంగ్లీష్ వినండి..
peanuts selling girl in pakistan talks flawless english

మన దేశంలోనే కాదు.. ఆసియాలోని కొన్ని దేశాల్లో ఇంగ్లీష్ (English) మాట్లాడే వారిని జ్ఞానవంతులుగా చూస్తారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడితే వారిని బాగా చదువుకున్న వారిగా పరిగణిస్తారు. ఇంగ్లీష్‌ను ఒక భాషలా కాకుండా ఎంతో గొప్పగా చూస్తారు. ఎందుకంటే బాగా చదువుకున్న వారు కూడా ఇంగ్లీష్ మాట్లాడడంలో తడబడుతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ బాలిక ఇంగ్లీష్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పాకిస్తాన్‌లో పల్లీలు అమ్ముకునే బాలిక (Pakistan Girl) చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో వేరుశెనగ పప్పులు, సన్‌ఫ్లవర్ గింజలు, స్నాక్స్‌ను విక్రయించే షుమైలా అనే బాలిక పాఠశాలకు వెళ్లనప్పటికీ ఎంతో చక్కగా ఆరు భాషలు మాట్లాడుతుంది. పాకిస్తాన్ వ్లాగర్, డాక్టర్ అయిన జీషన్ ఆ బాలికతో మాట్లాడి వీడియోను రూపొందించారు. ఆ బాలిక చెబుతున్న దాని ప్రకారం.. ఆమె తండ్రి ఏకంగా 14 భాషలు అనర్గళంగా మాట్లాడతాడట. ఆమె మాత్రం ఆరు భాషలు మాట్లాడగలదట. తన తండ్రి నుంచే ఆమె ఆ ఆరు భాషలను నేర్చుకున్నట్టు చెప్పింది. ఆ బాలిక ఉర్దూ, ఇంగ్లీష్, చిత్రాలి, సిరాయికి, పంజాబీ, పాష్టో భాషలను మాట్లాడగలదట.


అలాగే ఆమె తండ్రికి మొత్తం ఐదుగురు భార్యలని, మొత్తం 30 మంది పిల్లలు అని షుమైలా తెలిపింది. షుమైలా ఆ మొత్తం విషయాలను చక్కని ఇంగ్లీష్‌లో చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను దాదాపు ఏడు లక్షల మంది వీక్షించారు. 66 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోలోని బాలికపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఓహో.. అందుకే చలి ఇంతలా పెరుగుతోందా? అంకుల్ చేసిన పనిపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..


Optical Illusion Test: ఈ పళ్లలో నిమ్మకాయను 7 సెకెన్లలో పట్టుకుంటే.. మీ కళ్లకు సలాం కొట్టాల్సిందే..


Viral Video: ఎదుటి వారికి హాని చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో చూస్తే..


Viral Video: వామ్మో.. ఇతడు యమధర్మరాజు చుట్టంలా ఉన్నాడే.. చిచ్చు బుడ్డిని ఎలా కాలుస్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 24 , 2024 | 05:15 PM