Prabhas: మారుతి సినిమాకు ‘డార్లింగ్’ రెమ్యునరేషన్ ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-02-13T18:14:34+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. బిగ్ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ‘సలార్’ (Salaar), ‘ప్రాజెక్ట్ కె’ (Project K) లో నటిస్తున్నారు. మారుతి (Maruthi) దర్శకత్వంలోను ఓ సినిమా చేస్తున్నారు.

Prabhas: మారుతి సినిమాకు ‘డార్లింగ్’ రెమ్యునరేషన్ ఎంతంటే..?

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. బిగ్ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ప్రస్తుతం ‘సలార్’ (Salaar), ‘ప్రాజెక్ట్ కె’ (Project K) షూటింగ్‌‌లో పాల్గొంటున్నారు. మారుతి (Maruthi) దర్శకత్వంలోను ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘రాజా డీలక్స్’ (Raja Deluxe)అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు అదేటంటే..

ప్రతి సినిమాకు ప్రభాస్ రూ.100కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, ‘రాజా డీలక్స్’ చిత్రానికి గాను ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మూవీ బడ్జెట్‌ను అదుపులో ఉంచాలని రెబల్ స్టార్ భావిస్తున్నారట. అందులో భాగంగానే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదని తెలుస్తోంది. సినిమాకు వచ్చే లాభాల్లో మాత్రం వాటా తీసుకోబోతున్నట్టు సమాచారం అందుతుంది. ‘డార్లింగ్’ అభిమానులను సంతృప్తి పరచాలనే ఆలోచనలో భాగంగా మారుతితో ఓ సినిమా చేస్తున్నారు. లో బడ్జెట్‌లో చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. ‘రాజా డీలక్స్’ హార్రర్ జోనర్‌లో రూపొందుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ చిత్రం ప్రారంభమయ్యి చాలా రోజులైనప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ మూవీలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), శ్రీ లీల (Sreeleela) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తాత, మనవడిగా నటించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ తాత పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) పోషించనున్నారని తెలుస్తోంది. ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. ‘డార్లింగ్’ నటించిన ‘ఆది పురుష్’ (Adipurush) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ జూన్ 16న విడుదల కానుంది. ‘ఆది పురుష్’ రిలీజ్ అయిన మూడు నెలల్లోనే ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రెబల్ స్టార్‌పై దాదాపుగా రూ.1500కోట్ల వ్యాపారం జరగుతుంది.

ఇవి కూడా చదవండి:

SSMB28: మహేశ్ బాబుకి విలన్ ఫిక్స్!

Yash Rishab Shetty: ప్రధాని మోదీతో కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖుల భేటీ

Updated Date - 2023-02-13T21:05:03+05:30 IST