ఇండియాలో జూన్ 8న Realme 11 Pro సిరీస్ ఆవిష్కరణ, కెమెరా పిక్సల్స్ ఎంతో తెలుసా ?

ABN , First Publish Date - 2023-05-31T19:32:12+05:30 IST

జూన్ 8న అత్యాధునిక ఫీచర్లతో Realme 11 Pro, Realme 11 Pro+ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లలో రాబోతున్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్ల లాంచింగ్ విషయంపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

ఇండియాలో జూన్ 8న Realme 11 Pro సిరీస్ ఆవిష్కరణ, కెమెరా పిక్సల్స్ ఎంతో తెలుసా ?

Realme Pro Series హ్యాండ్‌సెట్లలో కొత్త మోడళ్లకోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. జూన్ 8న అత్యాధునిక ఫీచర్లతో Realme 11 Pro, Realme 11 Pro+ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లలో రాబోతున్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్ల లాంచింగ్ విషయంపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఈ హ్యాండ్‌సెట్లలో కెమెరా ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోని రానున్నాయి.

Realme 11 Pro, Realme 11 Pro+ జూన్ 8న భారతదేశంలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ బుధవారం ధృవీకరించింది. లేటెస్ట్ ఫీచర్లతో ఈ రెండు హ్యాండ్‌సెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. 6.7Inch డిస్‌ప్లే, 1TB వరకు ఇన్‌బుల్ట్ స్టోరేజీ, 5,000mAh బ్యాటరీతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు MediaTek డైమెన్సిటీ చిప్‌సెట్‌ల ద్వారా సమర్థవంతంగా పనిచేస్తాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Realme 11 Pro, Realme 11 Pro+ ప్రత్యేకతలు

Realme 11 Pro, Realme 11 Pro+ స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేక ఏంటంటే.. అధిక మెగాపిక్సల్ కెమెరాలు కలిగి ఉండటం. ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు వీలుగా Realme 11 Pro లో 100-మెగాపిక్సెల్ కెమెరా, Realme 11 Pro+లో 200-మెగాపిక్సెల్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI 4.0పై పనిచేస్తాయి. నానో డ్యూయల్ సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌లు. రెండు హ్యాండ్‌సెట్‌లు కూడా 6.7-అంగుళాల పూర్తి HD+(1,080x2,412 పిక్సెల్‌లు) డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. అవి MediaTek నుంచి 6nm ఆక్టాకోర్ డైమెన్సిటీ 7050 SoCతో పాటు 12GB వరకు ర్యామ్‌ అందుబాటులో ఉంటాయి.

Realme 11 Pro+ హ్యాండ్‌సెట్‌లో 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా.2 మెగాపిక్సల్ మైక్రో సెన్సార్ కూడా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం Realme 11 Pro, Realme 11 Pro+ వరుసగా 16-మెగాపిక్సెల్, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో అమర్చబడి ఉంటాయి.

రెండు స్మార్ట్‌ఫోన్లలో కూడా ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఫీచర్ ఉంది. Realme 11 Pro, Realme 11 Pro+ హ్యాండ్‌సెట్లలో వరుసగా 512GB, 1TB స్టోరేజీ సౌకర్యం కలదు. ఈ హ్యాండ్‌సెట్‌లు వరుసగా 67W, 100W ఛార్జర్, 5,000mAh బ్యాటరీలతో ప్యాక్ చేయబడి ఉంటాయి.

Updated Date - 2023-05-31T19:32:12+05:30 IST