వామ్మో.. ఈ కేసులో ఎన్ని ట్విస్టులో.. చనిపోయాడనుకున్న 18 ఏళ్ల ఈ కుర్రాడు ఎలా తిరిగొచ్చాడంటే..!

ABN , First Publish Date - 2023-01-18T16:48:15+05:30 IST

కొన్ని కేసుల్లో సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరైతే కేసుల నుంచి తప్పించుకునే క్రమంలో చిత్రవిచిత్రమైన ప్లాన్‌లు వేస్తూ పోలీసులను తప్పుదారి పట్టింస్తుంటారు. చివరకు అసలు విషయం వెలుగులోకి వస్తే గానీ..

వామ్మో.. ఈ కేసులో ఎన్ని ట్విస్టులో.. చనిపోయాడనుకున్న 18 ఏళ్ల ఈ కుర్రాడు ఎలా తిరిగొచ్చాడంటే..!

కొన్ని కేసుల్లో సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరైతే కేసుల నుంచి తప్పించుకునే క్రమంలో చిత్రవిచిత్రమైన ప్లాన్‌లు వేస్తూ పోలీసులను తప్పుదారి పట్టింస్తుంటారు. చివరకు అసలు విషయం వెలుగులోకి వస్తే గానీ.. నేరస్థుల తెలివితేటలు బయటపడవు. బీహార్‌లో ఇటీవల ఓ విచిత్రమన కేసు వెలుగులోకి వచ్చింది. చనిపోయాడనుకున్న 18 ఏళ్ల కుర్రాడు.. రెండేళ్ల తర్వాత ఎలా తిరిగిచ్చాడంటే..

భర్త పట్టించుకోకవడంతో దూరంగా ఉంటున్న భార్య.. ఓ రోజు ఎవరూ లేని సమయంలో స్నేహితులతో కలిసి..

బీహార్ (Bihar) రోహ్‌తాస్ పరిధి కోచస్ పరిధికి చెందిన రవిరంజన్ అనే మైనర్‌కు.. ఓ బాలికతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఉన్నట్టుండి 2021 అక్టోబర్‌లో ఇద్దరూ కనిపించుకుండాపోయారు. దీంతో బాలిక తల్లిదండ్రులు.. రవిరంజన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు (Kidnapping case) నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో 2022 అక్టోబర్ 31న భనాస్ ఓపీ పరిధి మఝౌలీ అనే గ్రామ పరిసరాల్లోని ఓ బావిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. అప్పటికే తమ కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్న రవిరంజన్ తల్లిదండ్రులు కొత్త ప్లాన్ వేశారు. గుర్తు తెలియని మృతదేహం (dead body) తమ కొడుకుదే అంటూ పోలీసులను ఆశ్రయించారు.

వివాహితతో కలిసి బ్యాంకు పని మీద బయటికి వెళ్లిన సహోద్యోగి.. తిరుగు ప్రయాణంలో అడవి మధ్యలో చీకటి పడడంతో..

తమ కొడుకును బాలిక కుటుంబ సభ్యులే చంపేశారంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులకు.. ముందుగా అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. చివరకు లోతుగా విచారించగా.. రవిరంజన్ చనిపోలేదని తెలిసింది. బాలికతో కలిసి రవిరంజన్ పూణేలో సహజీవనం (Live in relationship) చేస్తున్నట్లు గుర్తించారు. వారిని తీసుకురావడానికి వెళ్లే క్రమంలో. ఇటీవల యూపీలోని పండిట్ దీన్ దయాళ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారని సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

నా ప్రేయసిని పెళ్లి చేసుకోవద్దంటూ.. ఎంగేజ్మెంట్‌లోనే వరుడికి ప్రియుడి వార్నింగ్.. నాలుగో రోజే షాకింగ్ ట్విస్ట్..!

Updated Date - 2023-01-18T16:48:24+05:30 IST