Viral: రోడ్డు పక్కన ఏడుస్తూ కనిపించిన 4 ఏళ్ల పాప.. అటుగా వెళ్తున్న ఓ కాలేజీ యువతులకు డౌట్.. ఏమైందని అడిగితే..!
ABN , First Publish Date - 2023-11-23T22:29:14+05:30 IST
తప్పిపోయిన బాలికను ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చిన కాలేజీ యువతుల ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఓ చిన్నారి రోడ్డు పక్కన దిక్కు తోచని స్థితిలో నిలబడిపోయింది. తల్లిదండ్రులు ఎక్కడున్నారో, ఎటు వెళ్లాలో తెలీక గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించింది. మరోవైపు, అటుగా వెళుతున్న కొందరు కాలేజీ యువతులు ఆ చిన్నారిని చూశారు. మనకెందుకులే అని వెళ్లిపోకుండా ఆ యువతులు పోలీసుల సాయంతో బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు(College girls help baby unite with mother). ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) బదోన్ జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
జిల్లాలోని భమోరీ గ్రామానికి చెందిన గీత, తన భర్త, నాలుగేళ్ల కూతురితో కలిసి వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వివాహానికి హాజరైంది. ఆమె పెళ్లి వ్యవహారాల్లో బిజీగా ఉండగా ఆమె నాలుగేళ్ల కూతురు ఎటో వెళ్లిపోయింది. బిడ్డ కనిపించట్లేదన్న విషయాన్ని కాసేపటికి గుర్తించిన గీత తల్లడిల్లిపోయింది. మరోవైపు, ఆ చిన్నారి కుతూహలం కొద్దీ ఓ కూడలి వద్దకు వెళ్లి ఆ తరువాత ఏం చేయాలో తెలీక నిలబడిపోయింది. తల్లి కనిపించకపోవడంతో పెద్దపెట్టున ఏడవడం ప్రారంభించింది. అదృష్టవశాత్తూ, అటుగా వెళుతున్న కాలేజీ యువతులు కొందరు ఆ చిన్నారిని చూశారు.
బిడ్డను చూడగానే ఆమె తప్పిపోయిన విషయం వారికి అర్థమైంది. వెంటనే వారు చిన్నారిని ఎత్తుకుని ఊరడించే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకునేందుకు ట్రై చేశారు. కానీ పాప ఏ విషయమూ చెప్పలేకపోయింది. దీంతో, విద్యార్థినులు మరో ఆలోచన లేకుండా చిన్నారిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జరిగింది పోలీసులకు చెప్పి, పాపను ఆడిస్తూ అక్కడే ఉండిపోయారు. తాము ఇళ్లకు వెళ్లాల్సిన విషయాన్నే మర్చిపోయారు. పోలీసులు కూడా బిడ్డ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్ని్స్తుండగా బిడ్డ తల్లిదండ్రులే కంగారుపడుతూ అక్కడికి చేరుకున్నారు. స్టేషన్‌లో సురక్షితంగా ఉన్న బిడ్డ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయారు. తమ బిడ్డను అక్కడున్న యువతులే కాపాడారని తెలిసి కన్నీటిపర్యంతం అవుతూ ధన్యవాదాలు తెలిపారు.
Viral: షాకింగ్ వీడియో! భర్త వద్ద బైక్ నేర్చుకుంటున్న మహిళ..అతడు వెనక నుంచి అరుస్తున్నా వినకుండా..
Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..