Viral News: ఓ కాలు ముందుకు.. మరో కాలు వెనక్కు.. ఈ మహిళ ఫొటో ఫేక్ అనుకుంటున్నారేమో.. 100 శాతం నిజం..!

ABN , First Publish Date - 2023-05-05T12:12:19+05:30 IST

దయ్యాల గురించి ప్రస్తావించినప్పుడు 'వాటి కాళ్లు చూశావా? పాదాలు ముందుకున్నాయా? వెనక్కున్నాయా?' అని అడిగేవాళ్లం.. ఇప్పుడు ఓ మహిళ..

Viral News: ఓ కాలు ముందుకు.. మరో కాలు వెనక్కు.. ఈ మహిళ ఫొటో ఫేక్ అనుకుంటున్నారేమో.. 100 శాతం నిజం..!

చిన్నప్పుడు దయ్యాల గురించి విన్న చాలామందికి గుర్తుండిపోయిన విషయం దయ్యాల కాళ్లకు పాదాలు వెనక్కు ఉంటాయని. ఎప్పుడైనా ఎవరైనా దయ్యాల గురించి ప్రస్తావించినప్పుడు 'వాటి కాళ్లు చూశావా? పాదాలు ముందుకున్నాయా? వెనక్కున్నాయా?' అని అడగడం కూడా గుర్తే.. అయితే ఇప్పుడు దయ్యాల గోల ఎందుకంటారా? గోల దయ్యాలది కాదు. కాళ్లది. కాళ్ళకున్న పాదాలది. సహజంగా మనుషుల పాదాలు ముందుకు ఉంటాయి. పాదాలను వెనక్కు తిప్పడం అసాధ్యం. కానీ ఓ మహిళ మాత్రం ఓ పాదాన్ని సునాయాసంగా వెనక్కు తిప్పేస్తోంది. చాలామంది దీన్ని చూసి 'అంతా ఒట్టిదే.. అదంతా ఫేక్.. ఎడిట్ చేసిన ఫోటో' అని అనుకుంటున్నారు. కానీ అది ఫేక్ కాదు నిజమేనని తెలిసింది. పాదాలతో రికార్డులు బద్దలుకొట్టిన ఈ అమ్మాయి ఎవరు? ఆమె పాదాల కథేంటి? పూర్తీగా తెలుసుకుంటే.

యూఎస్(US) దేశం న్యూ మెక్సికో(New Mexico)లోని అల్పుకెర్కీలో కెల్సీ గ్రబ్ అనే అమ్మాయి నివసిస్తోంది. ఆమె లైబ్రరీలో ఉద్యోగం చేసేది(Library employee). 2021లో ఆమె లైబ్రరీలో పనిచేస్తున్నప్పుడు ఆమె సహోద్యోగి ఓ పుస్తకాన్ని అక్కడికి తీసుకెళ్లాడు. అది చూసిన కెల్సీ ఆ పుస్తకం గురించి ఆరా తీసింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్(Guinness world record book) సాధించిన వారి పేర్లు, విభాగాలతో సహా అందులో పొందుపరిచారని సహోద్యోగి కెల్సీతో చెప్పాడు. దాన్ని చూసిన ఆమెకు అసాద్యమైన పనులు చేస్తే అది గిన్నీస్ రికార్డ్స్ లో నమోదవుతుందని అర్థమయింది. ఆమె అందరికీ భిన్నంగా తన కాలు కదిలే విధానాన్ని గుర్తుకుతెచ్చుకుంది. 'నేనూ గిన్నీస్ రికార్డు నెలకొల్పుతాను' అని చెప్పింది. తన సహోద్యోగి ఆమె జోక్ చేస్తోందని అనుకున్నాడు. కానీ కెల్సీ ఇప్పుడు నిజంగానే ప్రపంచ గిన్నీస్ రికార్డు బద్దలు కొట్టింది.

Bride Sister: సొంత అక్క పెళ్లిలో ఓ చెల్లి రచ్చ.. వరుడిని నేనే పెళ్లాడతానంటూ బాంబు పేల్చడంతో అంతా షాక్.. అసలు నిజం తెలిసి..!


సాధారణంగా పాదాలు వెనక్కు తిప్పడానికి ప్రయత్నించినప్పుడు కేవలం 90డిగ్రీలు మాత్రమే సాధ్యపడుతుంది. కానీ కెల్సీ మాత్రం ఏకంగా 171.4డిగ్లీలకు తన పాదాన్ని(turn foot at 171.4 degrees) తిప్పగలదు. ఇలా చేస్తున్నప్పుడు ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలగడం లేదు. తనలో ఉన్న ఈ ప్రత్యేకత కారణంగా కెల్సీ ఐస్-స్కేటింగ్ ను కెరీర్(ice-skating) గా ఎంచుకుంది. అందులో కాళ్లు కదలకుండా ముందుకు వెనక్కు చూడటానికి ఆమెకు తన పాదాలలో ఉన్న ప్రత్యేకత సహాయపడుతోంది. ఈమె గురించి విన్నవారు 'ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. చాలామంది ఆ ప్రత్యేకతను లోపం అనుకుంటారు, కెల్సీ లాంటివారు దాన్నే బలంగా చేసుకుంటారు' అని చెబుతున్నారు.

Health: సడన్‌గా బరువు తగ్గిపోవడం.. తరచూ కడుపునొప్పి.. ఇలాంటి లక్షణాలు ఉన్నాయా..? అయితే అది మామూలు సమస్య కాదు..!


Updated Date - 2023-05-05T12:12:19+05:30 IST