Viral Video: ఓరి దేవుడో.. వీళ్లేం మనుషులండీ బాబూ.. గులాబీ పువ్వును నూనెలో ఫ్రై చేసి.. మసాలా దట్టించి మరీ తినేస్తున్నారుగా..!

ABN , First Publish Date - 2023-04-25T19:07:25+05:30 IST

పువ్వుల్ని నూనెలో ఫ్రై చేసి, మసాలా దట్టించి మొక్క జొన్న పొత్తులా..

Viral Video: ఓరి దేవుడో.. వీళ్లేం మనుషులండీ బాబూ.. గులాబీ పువ్వును నూనెలో ఫ్రై చేసి.. మసాలా దట్టించి మరీ తినేస్తున్నారుగా..!

అందరూ పువ్వుల్ని ఏం చేస్తారు? అమ్మాయిలు అయితే తలలో ధరిస్తారు. గుడికి తీసుకెళ్తారు, దేవుడి పటాలకు పెడతారు. మరికొందరు ఆహ్లాదంగా ఉంటుందని ఇంట్లో అలంకరణ కోసం వాడుతారు. కానీ పువ్వుల్ని నూనెలో ఫ్రై చేసి, మసాలా దట్టించి మొక్క జొన్న పొత్తులానో.. బిర్యానీలో వేయించిన ఉల్లిపాయల స్థానంలోనో వాడటం చూశారా? అది కూడా కేవలం గులాబీ మాత్రమే కాదు.. లిల్లీ.. సన్ ఫ్లవర్, మందారం వంటి పూలను నూనెలో వేయించి లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 'ఎంతో సుకుమారమైన పువ్వుల్ని ఇంత దారుణంగా తింటున్నారేంటండీ బాబూ..' అంటున్నారు నెటిజన్లు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

సాధారణంగా రెస్టారెంట్లకు వెళితే చాలామంది ఇచ్చే ఫుడ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? వెజ్(vegetarians) తినేవారు అయితే.. పన్నీర్, బిర్యానీ, బటర్ నాన్, పాలక్ పన్నీర్ ఇలా ఆర్డర్ ఇస్తూంటారు. అదే మాంసాహారులు(Non-veg) అయితే చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ అంటూ కాస్త వెరైటీగా తింటారు. కానీ వీటన్నిటికీ విభిన్నంగా గులాబీ పువ్వుల్ని(Rose flowers) నూనెలో వేయించి, దానికి తందూరీ మసాలా వేసి మొక్కజొన్న(corn) పొత్తులాగా కసక్కున నమిలేస్తున్నారు. ది కుర్తా గైస్(the kurta guys) అనే వ్యక్తి గార్డెన్ కేఫ్(Garden Cafe) లో ఓ ఫన్నీ వీడియోను ఇన్ట్రడ్యూస్ చేశాడు. పువ్వుల మెనూ(flower food menu) అంటూ ఇతను కొన్ని రకాల వంటకాలను చెబుతున్నాడు. గులాబీ65(Rose 65), సన్ ఫ్లవర్ బిర్యానీ(sunflower biriyani), బటర్ లిల్లీ(butter Lilly), మందార పరాటా(Hibiscus paratha) లిస్ట్ చదివాడు. వీడియోలో కుర్తా వేసుకున్న ఓ వ్యక్తి డబుల్ రోల్ ప్లే చేశాడు. కస్టమర్ గానూ వెయిటర్ గానూ ఇతను నటించాడు. ఒక వ్యక్తి గార్డెన్ కేఫ్(Garden Cafe) అని రాసిన పలక(slate) పట్టుకున్నాడు. అతను గార్డెన్ కేప్ లో పువ్వులతో తయారు చేసే వివిధ వంటకాల మెనూ చెబుతున్నాడు. అంతా చెప్పాక అతనికి ఆపోజిట్ గా ఉన్న మరొక వ్యక్తి అవన్నీ కాకుండా జాస్మిన్ మసాలా(jasmine masala) ఆర్డర్ చేశాడు. ఇలా అన్ని రకాల పువ్వులను ఫుడ్ మెనూ(flowers in food menu) చేర్చి అతను చెప్పడం నెట్టింట వైరల్ గా మారింది. వీడియోకు ముందు గులాబీని వేయించి తందూరీ జోడించి తింటున్న క్లిప్ ను కూడా జత చేశాడు.

Viral Video: అమ్మ కొడుతోంటే తప్పించుకోవడం ఎలా..? అంటూ తమ్ముడితో రిహార్సల్స్.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన తల్లి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!


thekurtaguy అనే ఇన్స్టాగ్రామ్ పేజీ(Instagram page) నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'ఓరి దేవుడా ఇదేంటీ.. పువ్వులను కూడా వదలడం లేదా?' అని అంటున్నారు. 'ఆ తందూరి గులాబీని ఎవరైనా అమ్మాయికి ఇచ్చి ఉంటే ఆమె సింగిల్ గా ఉండేది కాదు' అని కామెంట్ చేశారు. 'బహుశా అతన్ని ఎవరైనా రిజెక్ట్ చేశారేమో అందుకే కోపం కొద్దీ గులాబీలను తింటున్నట్టున్నాడు' అని మరికొందరు కామెంట్స్ చేశారు. 'పువ్వులంటే ఇష్టం ఉన్నవాళ్లు తమ పువ్వులు ఈ రెస్టారంట్ బారిన పడకుండా కాపాడుకోండి' అని మరికొందరు సలహా ఇచ్చారు.

Viral Video: ఈ ఆంటీ తెలివి తేటలు మామూలుగా లేవుగా.. రెండు నిమిషాల్లో అయే మ్యాగీతో ఇలా కూడా చేస్తారా..?


Updated Date - 2023-04-25T19:07:25+05:30 IST