Shocking: ఇంట్లోకి ఎవరూ రాకుండా చుట్టూ ఇనుప తీగెలు.. వాటికి కరెంటు పెట్టిన భార్య.. భర్తను చంపి.. 5 రోజులుగా ఇంట్లోనే ఉంచడంతో..

ABN , First Publish Date - 2023-03-11T16:48:28+05:30 IST

పిల్లలు చదువు నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. భార్యాభర్తలిద్దరే ఇంట్లో ఉంటున్నారు. అయితే సడన్‌గా ఐదు రోజుల నుంచి ఇంట్లో నుంచి చడీచప్పుడు లేదు. ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి

Shocking: ఇంట్లోకి ఎవరూ రాకుండా చుట్టూ ఇనుప తీగెలు.. వాటికి కరెంటు పెట్టిన భార్య.. భర్తను చంపి.. 5 రోజులుగా ఇంట్లోనే ఉంచడంతో..

పిల్లలు చదువు నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. భార్యాభర్తలిద్దరే ఇంట్లో ఉంటున్నారు. అయితే సడన్‌గా ఐదు రోజుల నుంచి ఇంట్లో నుంచి చడీచప్పుడు లేదు. ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూద్దామంటే చుట్టూ ఇనుప కంచెలు. ఇక చేసేదేమీలేక పిల్లలకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోకి వచ్చి చూస్తే షాకింగ్ సీన్. ఇంతకీ ఏమైంది? చుట్టూ ఇనుప కంచెలు వేసింది ఎవరు? తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఝార్ఖండ్‌ (Jharkhand) జంషెద్‌పుర్‌లో ఉలిదిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ కాలనీలో అమర్‌నాథ్‌ సింగ్‌, అతని భార్య (Wife) మీరా నివాసం ఉంటున్నారు. పిల్లలిద్దరూ ఇతర నగరాల్లో చదువుకుంటున్నారు. అమర్‌నాథ్ సింగ్ రియల్ ఎస్టేట్ (Real estate) వ్యాపారం చేస్తుంటాడు. ఆయా పనుల నిమిత్తం బయటకు వస్తూ వెళ్తూ ఉండేవాడు. సడన్‌గా ఐదు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. ఏమైందో ఏంటో తెలుసుకుందామంటే ఇంటి చుట్టూ ఇనుక కంచెలు వేసి ఉన్నాయి. దీంతో పిల్లలకు సమాచారం ఇస్తే ఇంటికి వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే తండ్రి అమర్‌నాథ్ సింగ్ హత్య చేయబడి ఉన్నాడు. దీంతో వారంతా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మీరాను అదుపులోకి తీసుకుని విచారిస్తే.. భర్త (husband)ను చంపి ఐదు రోజులు శవంతోనే గడిపింది.

మీరా మానసిక వ్యాధి (mental illness)తో బాధపడుతోంది. దీంతో ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. అంతేకాదు అనేక సార్లు మీరా ఇంట్లో వస్తువులను కూడా బయటకు విసిరేసేది. ఈ క్రమంలో అమర్‌నాథ్ అదృశ్యం కావడం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఇనుప కంచెకు కరెంట్ పెట్టి ఉండడంతో లోనికి వెళ్లలేకపోయారు. దీంతో స్థానికులు పుణెలో ఉంటున్న అమర్‌నాథ్‌ కుమారుడికి ఫోనులో విషయం తెలియజేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందడంతో మీరాను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అమర్‌నాథ్‌ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మీరా మానసిక స్థితి బాగోలేకపోవడంతో ఆ దిశగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Wife Twist: అత్తారింట్లో ముభావంగా ఉంటోంటే కొత్త కదా అని అంతా అనుకున్నారు.. కానీ సరిగ్గా నెల తర్వాత ఆ కోడలు చేసిన పనికి..

Updated Date - 2023-03-11T16:48:28+05:30 IST