Yellow Teeth: దంతాలు పచ్చగా ఉన్నాయా..? ఎంత ట్రై చేసినా తెల్లగా మారడం లేదా..? ఈ టిప్స్ పాటించండి చాలు..!

ABN , First Publish Date - 2023-04-19T14:20:18+05:30 IST

దంత వైద్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసి వేలరూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే తెల్లగా మెరిసిపోయే దంతాలు మీ సొంతమవ్వడమే కాదు.. పళ్ళు దృఢంగా మారతాయి కూడా..

Yellow Teeth: దంతాలు పచ్చగా ఉన్నాయా..? ఎంత ట్రై చేసినా తెల్లగా మారడం లేదా..? ఈ టిప్స్ పాటించండి చాలు..!

తెల్లగా ముత్యాల్లాగా పళ్ళు మిలమిలా మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ దురదృష్టం కొద్దీ చాలామందికి పసుపురంగు పళ్లు(yellow teeth) ఉంటాయి. మరికొందరికి నోటి దుర్వాసన(mouth smell) కూడా వస్తూంటుంది. రోజూ రెండుపూటలా చక్కగా పళ్లు తోమినా ఈ సమస్య ఏంటోనని బాధపడేవారు చాలామందే ఉన్నారు. అలాంటివారు ఏం బెంగపడక్కర్లేదు. దంత వైద్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసి వేలరూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే తెల్లగా మెరిసిపోయే దంతాలు మీ సొంతమవుతాయి.

పళ్ళు తోమే విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం, వేళ కాని వేళలో ఆహారం తీసుకోవడం, ఎక్కువకాలం పాటు మందులు వాడటం, కెఫిన్ ఆధారిత పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాల వల్ల పళ్ళు పసుపురంగులోకి మారతాయి. మొదటగా ఈ అలవాట్లను తగ్గించాలి.

వంట సోడా..(cooking soda)

పళ్ళమీద పసుపురంగు గార తొలగించుకోవడానికి వంటసోడా చాలా బాగా పనిచేస్తుందనే విషయం చాలామందికి తెలుసు. కానీ దీన్ని రోజూ వాడకూడదు. వారంలో రెండు నుండి మూడు సార్లు(twice or thrice in week) మాత్రమే వంట సోడాతో పళ్ళు తోమాలి. వంటసోడాతో పళ్ళు తోమడం వల్ల పళ్ళ మీద మురికి, పసుపు రంగు పోతుంది. గార కూడా మెల్లిగా తగ్గుముఖం పడుతుంది.

Viral Video: చెట్టుపైన కుర్రాడు.. చెట్టు కింద ఓ యువతి.. గుడ్లను చోరీ చేస్తోంటే సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన నెమలి.. చివరకు..!


స్ట్రాబెర్రీ..(strawberry)

స్ట్రాబెర్రీని మిల్క్ షేక్ లు, ఐస్ క్రీములు, కేక్ లు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటే పొరపాటే. పళ్ళను శుభ్రం చేయడంలో స్ట్రాబెర్రీ అద్భుతంగా పనిచేస్తుంది(Strawberry cleans teeth). రెండు స్ట్రాబెర్రీలను(two strawberry) తీసుకుని మెత్తటి గుజ్జుగా తయారు చేసి ఈ పేస్ట్ ను బ్రష్ మీద వేసుకుని సహజంగానే పళ్ళు తోముకోవాలి. పళ్ళ మీద మురికి, పసుపురంగు గార, పాచి తొలగిపోతాయి. ఈ స్ట్రాబెర్రీ పేస్ట్ లో కాసింత వంట సోడా కూడా మిక్స్ చేసి బ్రష్ చెయచ్చు. దీనివల్ల మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ఆయిల్ పుల్లింగ్..(oil pulling)

ఆయిల్ పుల్లింగ్ ఆయుర్వేదంలో ఎప్పటినుండో ఉన్న అద్బుతమైన పద్దతి. కొబ్బరి నూనెతో నోటిని పుక్కిలించడం ద్వారా పళ్ళు అద్బుతంగా మారతాయి. ఒక స్పూన్ మోతాదులో కొబ్బరినూనెను(1table spoon coconut oil) నోట్లో వేసుకుని సుమారు 15నిమిషాలు పుక్కిలించాలి. ఇలా చేసిన తరువాత సాధారణంగా బ్రష్ చేయవచ్చు. ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా పళ్ళ మీద పసుపు, నోటి దర్వాసన పోవడమే కాకుండా పళ్ళు గట్టిపడతాయి. చిగుర్లు దృఢంగా మారతాయి. దంత సమస్యలు దూరంగా ఉంటాయి.

నిమ్మకాయ..(Lemon)

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పళ్ళమీద మంచి ప్రభావం చూపిస్తుంది. నిమ్మతొక్కలను(Lemon peels) తీసుకుని పళ్ళమీద రుద్దవచ్చు. లేదంటే కాసింత నిమ్మరసం వేలితో తీసుకుని పళ్ళు తోముకోవాలి. ఈ రెండింటిలో ఏది చేసినా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

AC, Cooler ఏదీ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలు.. ఇల్లంతా యమా కూల్..!


Updated Date - 2023-04-19T14:20:18+05:30 IST