Share News

India vs New Zealand: సెంచరీ కొట్టిన డారిల్ మిచెల్.. న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే?

ABN , First Publish Date - 2023-10-22T17:30:05+05:30 IST

వరల్డ్ కప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ అద్భుతంగా రాణించాడు. 101 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కీలకంగా మారాడు.

India vs New Zealand: సెంచరీ కొట్టిన డారిల్ మిచెల్.. న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే?

ధర్మశాల: వరల్డ్ కప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ అద్భుతంగా రాణించాడు. 101 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కీలకంగా మారాడు. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో ఒపెనర్ రచిన్ రవీంద్రతో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మూడో నాలుగో వికెట్‌కు 159 పరుగుల పార్టనర్‌షిప్ చేశారు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర వ్యక్తిగత స్కోరు 75 పరుగుల వద్ద ఔటయినప్పటికీ డారిల్ మిచెల్ రాణించాడు.


ప్రస్తుతం 42 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ స్కోరు 2267గా ఉంది. మిచెల్ (102 నాటౌట్), గ్లేన్ ఫిలిప్ (13 నాటౌట్) చొప్పున క్రీజులో ఉన్నారు. డేవోన్ కాన్వే (0), విల్ యంగ్ (17), రచిన్ రవీంద్ర (75), టామ్ లాథమ్ (5) చొప్పున పరుగులు చేసి ఔటయ్యారు. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ 2, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ చొప్పున తీశారు.

Updated Date - 2023-10-22T17:30:05+05:30 IST

News Hub