IPL 2023: కొత్త జెర్సీ లాంచ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్.. అదిరిపోయిందిగా!

ABN , First Publish Date - 2023-03-19T16:50:37+05:30 IST

మరో రెండు వారాల్లో ఐపీఎల్(IPL) పండుగ ప్రారంభం కాబోతోంది. ఈ నెల 31న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న

IPL 2023: కొత్త జెర్సీ లాంచ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్.. అదిరిపోయిందిగా!

న్యూఢిల్లీ: మరో రెండు వారాల్లో ఐపీఎల్(IPL) పండుగ ప్రారంభం కాబోతోంది. ఈ నెల 31న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)-చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్లు తలపడతాయి. ఈ సీజన్ కోసం సన్నద్ధమవుతున్న ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals) ఆదివారం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఢిల్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. బ్లూ, రెండ్ కాంబినేషన్‌లో జెర్సీ ఆకట్టుకునేలా ఉంది.

ఏప్రిల్ 1న ఢిల్లీ కేపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌(Luknow Supre Giants)తో తలపడుతుంది. లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక, తొలి హోం గేమ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 4న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.

గతేడాది డిసెంబరులో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఐదుగురు ప్లేయర్లను కొనుగోలు చేసిన ఢిల్లీ.. జట్టును మరింత బలోపేతం చేసుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేయగా, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రిలీ రోసౌను రూ. 4.60 కోట్లకు దక్కించుకుంది. అలాగే, ఇషాంత్ శర్మ, మనీష్ పాండేలను కూడా సొంతం చేసుకుంది. పాండేను రూ. 2.4 కోట్లకు, ఇషాంత్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే, బెంగాల్ సీమర్ ముకేశ్ కుమార్‌ను 5.5 కోట్లకు తెచ్చుకుంది. ముకేశ్ 39 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 149 వికెట్లు పడగొట్టాడు.

ఢిల్లీ కేపిటల్స్ జట్టు:

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీషా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిక్ నోకియా, చేతన్ సకారియా, కమలేశ్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగి ఎంగిడి, ముస్తాఫిజుర్ రహ్మాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముకేశ్ కుమార్, మనీష్ పాండే, రిలీ రోసౌ, రిషభ్ పంత్

Updated Date - 2023-03-19T16:50:37+05:30 IST