IPL 2023: బాది వదిలిపెట్టిన పంజాబ్.. కోల్‌కతా ముందు భారీ లక్ష్యం!
ABN , First Publish Date - 2023-04-01T17:33:11+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) రెండో మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదైంది. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో ఇక్కడి ఐఎస్ బింద్రా
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) రెండో మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదైంది. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో ఇక్కడి ఐఎస్ బింద్రా స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan)కు తోడు, భానుక రాజపక్ష బ్యాట్‌తో విరుచుకుపడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఆరంభంలోనే మెరుపులు మెరిపించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది జోరుమీదున్నట్టు కనిపించాడు. అయితే, ఆ ఊపును కొనసాగించడంలో విఫలమై 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సౌథీ బౌలింగులో గుర్జాబ్‌కు క్యాచ్ ఇచ్చిన పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన భానుక రాజపక్స కూడా ఏమాత్రం తగ్గకుండా ఆడాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులకు వినోదం అందించాడు. 32 బంతులు ఆడిన రాజపక్స 5 ఫోర్లు, 2 సిక్సర్లతో సరిగ్గా అర్ధ సెంచరీ చేసి అవుటయ్యాడు.
అప్పటికి జట్టు స్కోరు 11 ఓవర్లలో 109 పరుగులు. దీంతో భారీ స్కోరు ఖాయమనుకునప్పటికీ ఆ తర్వాత పరుగులు రావడం కొంచెం కష్టంగా మారింది. అయినప్పటికీ రన్‌రేట్ పడిపోకుండా, వికెట్లు పారేసుకోకుండా ఆడి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. జితేశ్ శర్మ 21, సికందర్ రజా 16, శామ్ కరన్ 26(నాటౌట్), షారూఖ్ ఖాన్ 11(నాటౌట్) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు తీసుకున్నాడు.