ODI World Cup 2023: అప్‌డేట్.. ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్

ABN , First Publish Date - 2023-07-07T12:03:34+05:30 IST

టీమిండియాతో పాటు వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. గతంలో 8 జట్లను నేరుగా ఐసీసీ ప్రకటించగా క్వాలిఫైయర్స్ మ్యాచ్‌ల ద్వారా మరో రెండు బెర్తులు ఖరారయ్యాయి. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నేరుగా క్వాలిఫై కాగా అర్హత మ్యాచ్‌ల ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ టాప్-10లో స్థానం సంపాదించాయి.

ODI World Cup 2023: అప్‌డేట్.. ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్

వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఇంకా పూర్తి కాలేదు. కానీ రెండు బెర్త్‌లు ఖరారైపోయాయి. ఒక బెర్తును శ్రీలంక దక్కించుకోగా మరో బెర్త్‌ను నెదర్లాండ్స్ కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచకప్‌లో తలపడే 10 జట్లు ఏవేవో క్లారిటీ వచ్చేసింది. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నేరుగా క్వాలిఫై కాగా అర్హత మ్యాచ్‌ల ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ టాప్-10లో స్థానం సంపాదించాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే ప్రపంచకప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఒకసారి లుక్కేద్దాం. తొలుత అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొంటుంది. అక్టోబర్ 19న పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. అక్టోబర్ 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 29న లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడుతుంది. అటు నవంబర్ 2న ముంబై వేదికగా శ్రీలంకతో, నవంబర్ 5న కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడనుంది. లీగ్ దశలో చివరిగా నవంబర్ 11న బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

కాగా ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌లో నెదర్లాండ్స్‌ (నెట్‌ రన్‌రేట్‌ 0.160)తో పాటు స్కాట్లాండ్‌ (0.102), జింబాబ్వే (-0.099) కూడా 6 పాయింట్లతో సమానంగా నిలిచాయి. కానీ మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కారణంగా నెదర్లాండ్స్‌ ముందంజ వేసింది. నెదర్లాండ్స్ వన్డే ప్రపంచకప్‌లో ఆడటం ఇది ఐదోసారి. ఆ జట్టు 1996, 2003, 2007, 2011 ప్రపంచకప్‌ల్లోనూ ఆడింది. స్కాట్లాండ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత నెదర్లాండ్స్ ఆటగాళ్లంతా నమస్తే ఇండియా అనే పోస్టర్‌కు పోజులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-07-07T12:03:34+05:30 IST