SRH vs Punjab : బ్యాటింగ్‌ గాడినపడేనా?

ABN , First Publish Date - 2023-04-09T01:14:42+05:30 IST

బ్యాటర్ల దారుణ వైఫల్యంతో ఈ ఐపీఎల్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో సూపర్‌

SRH vs Punjab : బ్యాటింగ్‌ గాడినపడేనా?

ఉప్పల్‌లో పంజాబ్‌తో హైదరాబాద్‌ పోరు నేడు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): బ్యాటర్ల దారుణ వైఫల్యంతో ఈ ఐపీఎల్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌ను ఎదుర్కోనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో పవర్‌ ప్లేలో కనీసం 50 పరుగులు చేయలేకపోవడం హైదరాబాద్‌ బ్యాటింగ్‌ డొల్లతనాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్‌ మార్‌క్రమ్‌ కూడా సన్‌రైజర్స్‌ రాతను మార్చలేకపోయాడు. లఖ్‌నవూతో గత మ్యాచ్‌లో మార్‌క్రమ్‌ డకౌట్‌ కావడం గమనార్హం. ఇక రూ. 13.25 కోట్లతో కొనుక్కున్న హ్యారీ బ్రూక్‌ రెండు మ్యాచ్‌ల్లో (13, 3) కలిపి చేసింది 16 పరుగులే. మయాంక్‌, రాహుల్‌ త్రిపాఠిలలో నిలకడ లోపిస్తోంది.

రెండు మ్యాచ్‌ల్లో అబ్దుల్‌ సమద్‌ ఒక్కడే ధాటిగా ఆడాడు. మరోవైపు భారీ షాట్లకు ప్రసిద్ధుడైన క్లాసెన్‌కు పంజాబ్‌తో మ్యాచ్‌లోనైనా చాన్స్‌ ఇస్తారేమో చూడాలి. అఫ్ఘానిస్థాన్‌ పేసర్‌ ఫజల్లా ఫారూఖి ఆకట్టుకొనే బౌలింగ్‌ చేసినా..రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలర్లు డిఫెండింగ్‌ చేయగల స్కోరు లేకపోయింది. మరోవైపు రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు అందుకున్న పంజాబ్‌ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

Updated Date - 2023-04-09T01:14:42+05:30 IST