IPL League Cricket Match: ఐపీఎల్‌ టికెట్లకు బారులుతీరిన అభిమానులు

ABN , First Publish Date - 2023-05-09T07:37:43+05:30 IST

చేపాక్‌ ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ నెల 10న చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ కేపిటల్స్‌ జట్ల మధ్య జరుగనున్న ఐపీఎల్‌ లీగ్‌

IPL League Cricket Match: ఐపీఎల్‌ టికెట్లకు బారులుతీరిన అభిమానులు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక చేపాక్‌ ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ నెల 10న చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ కేపిటల్స్‌ జట్ల మధ్య జరుగనున్న ఐపీఎల్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌(IPL League Cricket Match) టికెట్ల విక్రయం సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ టికెట్లను కొనేందుకు అభిమానులు వేకువజాము ఐదు గంటల నుంచే టికెట్‌ కౌంటర్ల వద్ద బారులు తీరారు. ఇప్పటివరకూ ఈ స్టేడియంలో జరిగిన ఐదు పోటీలకు సంబంధించి ఉదయం 9.30 గంటలకు టికెట్లను విక్రయించారు. అయితే ఈ నెల 10 జరుగనున్న పోటీకి సంబంధించిన టికెట్ల విక్రయాన్ని మునుపెన్నడూ లేని విధంగా సోమవారం ఉదయం 7.30 గంటలకే ప్రారంభించారు. మహిళలకు, దివ్యాంగులకు వేర్వేరు కౌంటర్లలో టికెట్లు విక్రయించారు. ఒకరికి రెండు టికెట్ల చొప్పున విక్రయించారు. ఈ టికెట్లను కొనేందుకు అభిమానులు పోటీపడటంతో క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిపుచ్చారు.

2 నిమిషాలకే ఆన్‌లైన్‌ టికెట్ల అమ్మకం ? : ఈ పోటీలకు సంబంధించిన రూ.5వేలు, రూ.3వేల టికెట్లు సోమవారం ఉదయం ఆన్‌లైన్‌లో రెండు నిమిషాలకే అమ్మకాలు పూర్తయినట్లు ప్రకటించడం అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన టికెట్లను సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీనితో అభిమానులు ఉదయమే లాప్‌టాప్‏లు, మొబైల్‌ ఫోన్లను ఆన్‌ చేసుకుని టికెట్లను కొనేందుకు సంబంధించిన సైట్లన్‌ తెరచి చూసినప్పుడు ఆ టికెట్ల విక్రయం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుందనే ప్రకటన జారీ అయ్యింది. అటు పిమ్మట ఉదయం 9.30గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు కొనేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. అయితే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం ప్రారంభమైన రెండు నిమిషాలకే అన్ని టికెట్లు అమ్ముడైనట్లు ప్రకటన వెలువడటంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.ఈఆన్‌లైన్‌ టికెట్లను టోకుగా కార్పొరేట్‌ సంస్థలకు ముందుగానే విక్రయించి ఉంటారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

nani2.2.jpg

Updated Date - 2023-05-09T07:37:43+05:30 IST