India Shooter Chain Singh: చైన్ సింగ్‌కు కాంస్యం
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:56 AM
భారత షూటర్ చైన్ సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో 443.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెలిచాడు. ఈవెంట్‌లో హంగేరి షూటర్ ఇస్త్వాన్ పెని స్వర్ణం, చైనాకు చెందిన తియాన్ రజతం సాధించారు

షూటింగ్ వరల్డ్ కప్
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత షూటర్ చైన్ సింగ్ కాంస్య పతకంతో మెరిశాడు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో చైన్ సింగ్ మొత్తం 443.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. హంగేరి షూటర్ ఇస్త్వాన్ పెని స్వర్ణం, చైనాకు చెందిన తియాన్ రజతం సాధించారు.
ఇవీ చదవండి:
ప్లేయింగ్ 11తోనే బిగిస్తున్నారు
రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్
ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి