బీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం: ఎమ్మెల్యే కోనప్ప
ABN , First Publish Date - 2023-04-21T22:32:38+05:30 IST
బెజ్జూరు, ఏప్రిల్ 21: పార్టీకి కార్యకర్తలే బలమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో పార్టీకార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ క్రీయా శీలక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించార న్నారు.

బెజ్జూరు, ఏప్రిల్ 21: పార్టీకి కార్యకర్తలే బలమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో పార్టీకార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ క్రీయా శీలక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించార న్నారు. ఇందులో భాగంగా ఈనెల25న ఈస్ గాంలో నిర్వహించే సమావేశానికి మండలం లోని కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయ వంతం చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ దేశంలో తిరుగులేని శక్తిగా మారుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ ఓంప్రకాష్, కోఆ ప్షన్ బషరత్‌ఖాన్, నాయకులు జగ్గాగౌడ్, సకా రాం, వెంకన్న, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొ న్నారు.
కౌటాల: కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఆయననివాసంలో కౌటాల, చింతలమానేపల్లి మండల కార్యకర్తలతో ఏర్పా టుచేసిన సమావేశంలో మాట్లాడారు. కార్యకర్త లే పార్టీకి గుండెకాయలు లాంటివారన్నారు. పార్టీలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబమమే అన్నారు. ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనం దరిపై ఉందని, దాని కోసం మనమంతా కలసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో ఎంపీపీలు విశ్వ నాథ్, నానయ్య, డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ మాం తయ్య, నాయకులు వసంత్‌రావు, వెంకన్న, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు .
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ
కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన ముర్ముర్‌లక్ష్మికి రూ.16వేలు, సాండ్‌గాం గ్రామానికి చెందిన మొండికి రూ.49,500 సీఎంఆర్‌ఎఫ్ చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అందజేశారు.
సమస్యలు పరిష్కరించాలి..
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బెజ్జూరు, కౌటాల మండలానికి చెందిన వీవో ఏలు శుక్రవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు వినతిపత్రం అందజేశారు.
దుకాణం యజమానికి పరామర్శ
సిర్పూర్(టి): మండలంలో ధనలక్ష్మి జువె ల్లర్స్ దుకాణంలో బుధవారం రాత్రి చోరీ జరగగా శుక్రవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యజమాని పైడినానాజీని పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట కోఆప్షన్ సభ్యుడు కీజర్ హుస్సేన్, సర్పంచ్ యాదగిరి బ్రహ్మయ్య, ఉప సర్పంచ్ తోట మహేష్, నాయకులు ప్రసాద్, శ్రీనివాస్, అఖిల్ తదితరులు ఉన్నారు.