రాష్ట్ర స్థాయిలో ద్వితీయస్థానం పొందడం అభినందనీయం
ABN , First Publish Date - 2023-05-10T23:14:29+05:30 IST
ఆసిఫాబాద్, మే 10: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో రెండోస్థానం పొందడం అభినంద నీయమని కలెక్టర్ హేమంత్‌సహదేవరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, కళా శాల అధ్యాపకులు, తల్లితండ్రుల సమక్షంలో అభినం దించారు.
- కలెక్టర్ హేమంత్ సహదేవరావు
ఆసిఫాబాద్, మే 10: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో రెండోస్థానం పొందడం అభినంద నీయమని కలెక్టర్ హేమంత్‌సహదేవరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, కళా శాల అధ్యాపకులు, తల్లితండ్రుల సమక్షంలో అభినం దించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లారాష్ట్రంలో రెండోస్థానం సాధిం చడం సంతోషంగా ఉందని, ఇదేస్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్ సుమన్‌ను శాలువాతో సన్మానించారు. జనరల్‌విద్యార్థులు4000మంది హాజరు కాగా 3249మంది ఉత్తీర్ణులయ్యారని, 81శాతం ఉత్తీర్ణ తతో జిల్లారాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచిందన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ కళాశాలల్లోని విద్యా ర్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించడం హర్షనీయమని విద్యార్థులు భవిష్యత్‌లో పోటీపరీక్షల్లో సైతం మంచి మార్కులు సాధించాలన్నారు. అత్యు న్నత ప్రతిభ కనబర్చిన వారిలో ఎంజెపీ కళాశాల విద్యార్థిని దీపిక బిస్వాన్ (985), త్రిష(984), సంధ్యారాణి(981), ఆసి ఫాబాద్మోడల్స్కూల్విద్యార్థియశశ్రీ(976), సుప్రియ (971), జైనూరు ప్రభుత్వజూనియర్ కళాశాల విద్యార్థి పెందూరురాజు(973), కాగజ్నగర్ప్రభుత్వ జూని యర్ కళాశాల విద్యార్థి పవన్(969) మార్కులతో అత్యున్నత ప్రతిభకనబర్చారని తెలిపారు. విద్యార్థులు మంచిలక్ష్యాన్ని ఎంచుకొని ఆదిశగా పట్టుదలతో ముం దుకు సాగాలనివారికి తగినప్రోత్సాహం అందించేం దుకు తల్లిదండ్రులు,అధ్యాపకులు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలోసంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థికి సన్మానం
జైనూరు: ఇంటర్మీడీయట్ ద్వీతీయసంవత్సరం పరీ క్షలో 973మార్కులు సాధించి రాష్ట్రంలో రెండోస్థానం లో నిలిచిన ఉషేగాంకు చెందిన పెందుర్రాజును బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత్ సహదే వరావ్, డీఐఈవో శ్రీధర్‌సుమన్, జైనూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీదేవి, అధ్యాపకులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.