విద్యార్థుల్లో గణనీయమైన మార్పులకు నాంది పలకాలి

ABN , First Publish Date - 2023-08-18T00:55:05+05:30 IST

ఉపాధ్యాయులు విద్యార్థుల్లో గణనీయమైన మార్పులకు నాంది పలకాలని కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి పిలిపునిచ్చారు.

విద్యార్థుల్లో గణనీయమైన మార్పులకు నాంది పలకాలి
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 17 : ఉపాధ్యాయులు విద్యార్థుల్లో గణనీయమైన మార్పులకు నాంది పలకాలని కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి పిలిపునిచ్చారు. గురువారం మనఊరు - మనబడి, అకాడమిక్‌ క్యాలెండర్‌లో విద్యా కార్యక్రమాలపై అధి కారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ టీచర్స్‌ చేంజ్‌ మేకర్స్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఉపాధ్యాయులు సొంతంగా తయారు చేసిన టీ ఎల్‌ఎం వాడా లన్నారు. వర్క్‌బుక్‌ ఉపయోగించి రోజు మూల్యాంకనం చేయాలని, రీడింగ్‌ కంపె యిన్‌, ప్రణాళిక ప్రకారం బోధన, తదితర విద్యారంగ కార్యక్రమాలపై చర్చించారు. డీఈవో రవీందర్‌ రెడ్డి, సంబంధిత అధికారులు హాజరయ్యారు.

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌

జిల్లాలోని సోన్‌ మండలంలోని సోషల్‌ వెల్ఫేర్‌, జూనియర్‌ కళాశాలలను కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి పది విద్యార్థులకు గణితం పాఠాలు బోధించారు. బోర్డుపై లెక్కలు చేస్తూ పలు చిట్కాలు అందించారు. విద్యార్థుల్లోని విషయ పరిజ్ఞానాన్ని ప్రశ్నల రూపంలో పరీక్షించారు. ఆటలు, వ్యాసరచన, తదితర అంశాల్లో పట్టు సాధిస్తే భవిష్యత్తులో రాణిస్తారని సూచించారు. విద్యార్థులు వేసి పెయింటింగ్‌ గోడలపై చూసి అభినందించారు. ఇంటర్‌ విద్యార్థులతోను విషయ పరిజ్ఞానం పరీక్షించారు. తరగతి గది శుభ్రత, తదితర వాటిలో ఆదర్శంగా ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్టాక్‌ రిజిస్టర్‌ పరిశీలించారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. గాంధీనగర్‌లో పర్యటించి విషజ్వరాలు ప్రబ లకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆయిల్‌ పామ్‌ తోట పరిశీలించారు. ప్రిన్సిపాల్‌ శివరాజ్‌, జడ్పీటీసీ జీవన్‌ రెడ్డి, ఎంపీడీవో మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

కూరగాయల సాగుతో అధిక దిగుబడి

మామడ : రైతులు కూరగాయల సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చందారం గ్రామానికి చెందిన కోండ్ర శివారెడ్డి సాగుచేస్తున్న కూరగాయల పంటను పరిశీలించారు. అనంతరం రైతును అభినందించారు. కూరగాయల సాగుతో లాభాలతో పాటు ది గుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రతీ రైతు పంట వేసే ముందు భూసార పరీక్ష చేయించుకోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికా హారం అందించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ లింగారెడ్డి, ఏడీఏ వినయ్‌ బాబు, ఎంపీడీవో రమేష్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సరికెల సంతోష్‌, కార్యదర్శులు ఉన్నారు.

Updated Date - 2023-08-18T00:55:05+05:30 IST