ఘనంగా రంజాన్ వేడుకలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:43 PM
జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. మండలాల్లోని పలు ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. మండలాల్లోని పలు ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలకు పలు వురు ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపా రు. అవాంఛనీ య సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మండలంలో వెళ్లే రహదారి సమీపంలో గల ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మె ల్యే ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, నాయకులు బాలేష్‌గౌడ్, మల్లేష్, చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. సీఐ రవీం దర్ ఆధ్వర్యంలో ఎస్సై ప్రశాంత్ బందోబస్తు నిర్వహిం చారు.
బెజ్జూరు(ఆంద్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు కుకుడ, మర్తిడి, ఎల్కపల్లి, గోల్కొండ తదితర గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు.
పెంచికలపేట(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ముస్లింలు ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఎస్సై కొమురయ్య శుభాకాంక్షలు తెలిపారు.
చింతలమానేపల్లి(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఎస్సై నరేష్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బాబాసాగర్‌లో పండగ శుభాకాంక్షలు తెలిపారు.
దహెగాం(ఆంధ్రజ్యోతి): మండలంలోని బీబ్రా, గొర్రెగుట్ట, మొట్లగూడ గ్రామాల్లో ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కెరమెరి(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుల్తాన్‌గూడ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఎస్సై విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందో బస్తు నిర్వహించారు.
సిర్పూర్(టి)(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కొత్త, పాత ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రెండు ఈద్గాల వద్ద కౌటాల సీఐ రమేష్, ఎస్సై కమలాకర్ పోలీసు సిబ్బందితో బందో బస్తు నిర్వహించారు.
కాగజ్‌నగర్(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పాటు ఆయా పార్టీల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని చింతగూడ, కోయవాగు గ్రామాల్లో రంజాన్ వేడుకల్లో జడ్పీ ఇన్‌చార్జి మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జి లెండుగురే శ్యాంరావు, తదితరులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో జడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిర్‌తో పాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘట నలు జరుగకుండా పట్టణ సీఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో బందో బస్తు నిర్వహించారు.
రెబ్బెన: ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు కేంద్రప్రభు త్వం ప్రవేశ పెట్టబోయే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రెబ్బెనలో చేతికి నల్ల బ్యాడ్జిలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మసీదు కమి టీ అధ్యక్షుడు జహీర్ బాబా, ప్రధాన కార్యదర్శి నాజీర్ ఉస్మాని, జాకీర్ ఉస్మానితో పాటు ముస్లింలు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై చంద్రశేఖర్ బందోబస్తు చేపట్టారు.
వాంకిడి(ఆంధ్రజ్యోతి): వాంకిడి, గోయేగాం ఈద్గాల వద్ద ప్రత్యే క ప్రార్థనలు నిర్వహించారు.
జైనూర్(ఆంధ్రజ్యోతి): మండలంలో రంజాన్ వేడుకలు ఘనం గా జరిగాయి. సీఐ రమేష్ ముస్లింలకు శభాకాంక్షలు తెలిపారు.
సిర్పూర్(యు)(ఆంధ్రజ్యోతి): మండలంలో సోమవారం రంజాన్ పండుగను ముస్లిం సోదారులు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలొని ఈద్‌గాలో సోమవారం ఉదయంనే ముస్లిం సోదారులు ప్రత్యేక నమాజ్ అదా చేశారు.అదే విధంగా ఈద్‌గాలో ప్రార్థనాలు చేసిన తరువాత రంజాన్ శుభకంక్షాలు తెలియజెశారు.అదే విధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రవు,మాజీ సర్పంచులు ఆర్క నాగోరావు,ఆత్రం ఓంప్రకాష్,రాజెశ్వర్,కుమ్ర భీంరావులు ముస్లిం సోదారులకు శుభకంక్షాలు తెలియజెశారు.ఈ కార్యక్రమంలో శేక్ ఖాలీల్,అబ్దుల్,కరిమ్,ముక్తార్,రయిమ్ తదితరులు పాల్గొన్నారు.