రాజీవ్‌గాంధీ ఆన్‌లైక్ క్విజ్ పోస్టర్ల విడుదల
ABN , First Publish Date - 2023-06-16T22:11:25+05:30 IST
పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్ర వారం రాజీవ్‌గాంధీ ఆన్‌లైక్ క్విజ్ పోస్టర్లను నాయకులు విడుదల చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి చిలుముల శంకర్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బండి ప్రభాకర్, డీసీసీ ఉపాధ్యక్షుడు తొంగల మల్లేష్‌లు మాట్లాడుతూ పోటీలో పాల్గొనే వారు 7661889889 నంబర్‌కు మిస్‌కాల్ ఇవ్వాలన్నారు.

బెల్లంపల్లి, జూన్ 16: పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్ర వారం రాజీవ్‌గాంధీ ఆన్‌లైక్ క్విజ్ పోస్టర్లను నాయకులు విడుదల చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి చిలుముల శంకర్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బండి ప్రభాకర్, డీసీసీ ఉపాధ్యక్షుడు తొంగల మల్లేష్‌లు మాట్లాడుతూ పోటీలో పాల్గొనే వారు 7661889889 నంబర్‌కు మిస్‌కాల్ ఇవ్వాలన్నారు. జూలై 2న పోటీ ఉంటుందన్నారు. ప్రథమ బహుమతిల్యాప్‌టాప్, ద్వితీయ స్మార్ట్‌ఫోన్, తృతీయ ట్యాబ్‌తోపాటు ప్రతీ అసెంబ్లీలో ఒక మహిళకు ఎలక్ర్టిక్ స్కూటీ ఇస్తామన్నారు. ఆదర్శ్‌వర్దన్, రొడ్డ శారద, శ్యాం, రాజలింగు, పాల్గొన్నారు.
కాసిపేట: రాజీవ్‌గాంధీ యూత్ ఆన్‌లైన్ క్విజ్ కాంపిటేషన్‌లో యువత పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల కృష్ణ అన్నారు. సిద్దం తిరుపతి, ఎంపీటీసీ భీంరావు, నాయకులు రాకేష్, స్వామి, రమేష్, షకీల్, మహంకాళి, వెంకటేష్, చిలుకయ్య పాల్గొన్నారు.